ల‌తా మంగేష్క‌ర్‌కు నివాళిగా 40 ఫీట్ల వీణ విగ్ర‌హం ఏర్పాటు

ల‌తా మంగేష్క‌ర్‌కు నివాళిగా.. 40 ఫీట్ల వీణ విగ్ర‌హం ఏర్పాటు

1
TMedia (Telugu News) :

ల‌తా మంగేష్క‌ర్‌కు నివాళిగా.. 40 ఫీట్ల వీణ విగ్ర‌హం ఏర్పాటు

టీ మీడియా సెప్టెంబర్‌ 28,ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో 40 ఫీట్ల వీణ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. మేటి గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్‌కు నివాళిగా ఆ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. న‌గ‌రంలో ఉన్న ల‌తా మంగేష్క‌ర్ చౌక్ వ‌ద్ద ఈ వీణ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ప్ర‌ధాని మోదీ దీన్ని ఇవాళ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించ‌నున్నారు. ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, కేంద్ర మంత్రి కిష‌ణ్ రెడ్డి పాల్గొంటారు.

Also Read : ఎంపీ ర‌వి కిష‌న్‌ను మోసం చేసిన వ్యాపార‌వేత్త‌

న‌గ‌రంలోని రామ్ క‌థా పార్క్‌లో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. 1929లో లతా మంగేష్క‌ర్ జ‌న్మించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి ఆర‌వ తేదీన ఆమె ముంబైలో మ‌ర‌ణించారు. ఉత్త‌మ నేప‌థ్య గాయ‌నిగా ఆమె మూడు సార్లు జాతీయ అవార్డు కూడా గెలిచారు. ప‌రిచ‌య్‌, కోరా కాగ‌జ్‌, లేకిన్ చిత్రాల పాట‌ల‌కు అవార్డులు వ‌చ్చాయి. యే మేరే వ‌త‌న్‌కే లోగో లాంటి దేశ‌భ‌క్తి పాట‌ను కూడా ఆమె ఆల‌పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube