వివాహ వేడుకకూ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇలా..

వివాహ వేడుకకూ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇలా..

0
TMedia (Telugu News) :

వివాహ వేడుకకూ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇలా..

లహరి,జనవరి 27,కల్చరల్ : వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కలకాలం గుర్తిండిపోయే వేడుక.అటువంటి వేడుకను భారీ ఎత్తున నిర్వహించాలని అందరకోరుకుంటారు. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి బంధు, మిత్రులకు విందు, వినోదాన్ని అందిస్తారు. అయితే అనుకోని సందర్భంలో వివాహాన్ని ఆపేయాల్సి వస్తే… అప్పటివరకు పెట్టిన ఖర్చు వెనక్కి రాదు. అందువల్ల, కొన్ని కంపెనీలు వినూత్నంగా వివాహ బీమాను e ఆఫర్​ చేస్తున్నాయి. అయితే ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ప్రధానంగా దాదాపు రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే పెళ్లిళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అనుకోని అనిశ్చితి పరిస్థితుల్లో పెళ్లి ఆగిపోయిన సందర్భాల్లో మాత్రమే ఈ ఇన్సూరెన్స్​ వర్తిస్తుంది. ఒకవేళ వరుడు లేదా వధువు తమ ఆలోచనలను మార్చుకొని వివాహం రద్దు చేసుకున్న సందర్భాల్లో ఈ ఇన్సూరెన్స్​ కింద కవరేజీ లభించదు. దీని గురించి లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్, రీఇన్స్యూరెన్స్ చీఫ్ సంజయ్ దత్తా మాట్లాడుతూ.. సాధారణంగా పెళ్లి క్యాన్సిల్ కావాలని ఎవరూ కోరుకోరని చెప్పారు. కాబట్టి వివాహ బీమా తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు రారన్నారు. ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్లు ఇలాంటి ఇన్సూరెన్స్‌లను కొనుగోలు చేయమని వధూవరులను ఒప్పిస్తారని, పెళ్లిలో ఈ కవర్ ఆ నష్టాలను తిరిగి చెల్లిస్తుందని వివరించారు. . వివాహ బీమాపై గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహం ఆగిపోతుందనే ఆలోచనలో ఎవరూ ఉండరని అన్నారు. కాబట్టి భారతదేశంలో దీనికి అంతగా డిమాండ్​ లేదని చెప్పారు.

Also Read : తెలుగింటి సత్యభామ.. జమున ఇకలేరు

అనేక భారీ-బడ్జెట్ వివాహాలకు మాత్రం బీమా కవరేజీ తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. . రూ.50 లక్షలకు పైగా బడ్జెట్‌తో వివాహాలకు బీమా కవరేజీని కొనుగోలు చేయడం శ్రేయస్కరమని, ఇటువంటి పెళ్లిళ్లకు పెత్త ఎత్తున కళాకారులు, పనివారికి అడ్వాన్సులు చెల్లించాల్సి ఉంటుందని, వారు హాజరుకాని పక్షంలో ఇన్సూరెన్స్​ కవరేజీ లభిస్తుందని ఆయన చెప్పారు. వివాహ వేడుకకు ముందు కానీ, జరుగుతున్న సమయంలో కానీ అనూహ్య సంఘటన జరిగితే వెంటనే బీమా కంపెనీకి సమాచారాన్ని అందించాలి. అనంతరం బీమా కంపెనీ వాస్తవాలను పరిశీలిస్తుంది. జరిగిన నష్టం సరైన కారణంతో అని వారు నిర్ధారిస్తే ఆ ఖర్చు తిరిగి చెల్లిస్తుంది.ఉగ్రవాద దాడి, సమ్మె, వధూవరులను కిడ్నాప్ చేయడం, పెళ్లికి వచ్చిన అతిథుల దుస్తులు, వ్యక్తిగత వస్తువులు కోల్పోవడం, వివాహ వేదిక ఆకస్మికంగా అందుబాటులో లేకపోవడం, పాలసీదారుడి ఆదేశానుసారమే వివాహ వేదికకు నష్టం వాటిల్లడం వంటి సందర్భాల్లో క్లెయిమ్‌లకు ఎలాంటి పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవు. నిర్లక్ష్యం లేదా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆస్తి నష్టం జరిగినట్లు కూడా నిర్ధారణ అయితే వారికి ఎలాంటి పరిహారాలు అందవు. వధువు, వరుడు లేదా కుటుంబ సభ్యుల మధ్య వివాదాల కారణంగా వివాహం రద్దయితే బీమా సంస్థ కవరేజీని అందించదు. అంతేకాదు, వివాహానికి అవసరమైన అనుమతులు తీసుకోలేకపోవడం, కోర్టు తీర్పులు, పూజారులు లేదా అతిథులు రాకపోవడం మొదలైన వాటి కారణంగా వివాహం ఆగిపోయిన సందర్భాల్లోనూ కవరేజీ లభించదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube