ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు
టీ మీడియా, సెప్టెంబర్‌ 16, బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణం లో సెప్టెంబర్ 17 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఆదేశాల మేరకు ఈరోజు అనగా 16 సెప్టెంబర్ 2022 నుండి 18 సెప్టెంబర్ 2022 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు వేడుకల్లో భాగంగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గకేంద్రంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన 15,000 మంది నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అనధికారులు, విద్యార్థులు, యువతీయువకులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వ్యాపారవర్తకులు, ప్రజలు, తదితరులతో భారీ ర్యాలీ మరియు సభ జరిగింది.

Also Read : తెలంగాణ‌కు పోరాటాలు కొత్త కాదు : మంత్రి కేటీఆర్

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ , నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస , టి.ఆర్.ఎస్.వి నాయకులు, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా పరిషత్ సీ.ఈ.వో నరేందర్ , డి.ఆర్.డి.వో శేషాద్రి , ఎస్సి కార్పొరేషన్ ఈ.డి దుర్గాప్రసాద్ , బెల్లంపల్లి ఆర్.డి.వో శ్యామలదేవి , ఏ.సి.పి మహేష్ , నియోజకవర్గ అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube