మద్దునూరు సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ జి.రవి
మద్దునూరు సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ జి.రవి
మద్దునూరు సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ జి.రవి
టి మీడియా, జూన్ 23,జగిత్యాల :- మద్దనూరు గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బుధవారం బుగ్గరం మండలం లోని మద్దునూరు గ్రామపంచాయతీని సందర్శించిన కలెక్టర్ గ్రామాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, నిర్మాణం పూర్తి చేసిన స్మశాన వాటిక సందర్శించిన కలెక్టర్ వాటి నిర్వహణ పై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అక్కడి నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన దామోదరరావు ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారని, వారి విజ్ఞాపన మేరకు సీఎం కేసీఆర్ ఈ గ్రామంలో పట్టాల్సిన అభివృద్ధి పనుల పై నివేదిక తయారు చేయాలని ఆదేశించారని కలెక్టర్ తెలిపారు.
Also Read : ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు
మండల హెడ్‌క్వార్టర్ కు దూరంగా ఉండటం వల్ల ఈ కొంతమేర వెనుకబడి ఉందని, గ్రామంలో 3.5 కిలో మీటర్ల సీసీ రోడ్లు, 1 కిలోమీటర్ మురికి కాలువ ఉన్నాయని, మిగిలిన గ్రామం వ్యాప్తంగా దశలల వారిగా సిసి రోడ్లు, అవసరమైన డ్రైన్ ల నిర్మాణ ప్రతిపాదనలు తయారు చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధులు, నిధులు వినియోగించి గ్రామ అభివృద్ధికి వెంటనే చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులు నిర్వహణ బాధ్యత ను గ్రామ ప్రజలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube