ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

1
TMedia (Telugu News) :

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

టీ మీడియా, ఆగస్టు 19, మహానంది: మహానంది మండల పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి గ్రామం, బసాపురంలో శుక్రవారం వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టారు.పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఇర్ఫాన్ పర్యవేక్షణలో పలు వీధుల్లో రోడ్లు శుభ్రం చేయించడంతో పాటు,పీర్ల చావిడి, ప్రతి వీధిలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు.ఈ మేరకు మురుగు నీటి కాలువలను మరియు ప్రధాన వీధులను పారిశుధ్య కార్మికులు శుభ్ర పరుస్తున్నారు.

 

Also Read : మహానందిశ్వరుని దర్శించుకున్న న్యాయమూర్తులు

 

ఈ సందర్భంగా కొండా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కాలువలు శుభ్రపరిచి కాలువలలో మరియు నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ ను చల్లి దోమలు వ్యాప్తి చెందకుండాఅరికడుతున్నామన్నారు.పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్ మాట్లాడుతూ ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం అందజేసిన తడి చెత్త మరియు పొడి చెత్త డస్ట్ బిన్ లను వాడి పర్యావరణం కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube