ఇంటర్మీడియట్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి

విద్యార్థులకు శుభాకాంక్షలు కలెక్టర్ అనుదీప్

1
TMedia (Telugu News) :

ఇంటర్మీడియట్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి

-విద్యార్థులకు శుభాకాంక్షలు కలెక్టర్ అనుదీప్

టి మీడియా, మే 5, ఖ‌మ్మం: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం నుండి ప్రారంభం కానున్న పరీక్షలకు 34 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థికి ఇంటర్మీడియట్ ఎంతో కీలకమని చెప్పారు. ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, మంచి గ్రేడ్ తో ఉతీర్ణత సాధించి తల్లిదండ్రులకు తద్వారా మన జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని 30 నిమిషాలు ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని, సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి తల్లితండ్రులు విద్యార్థులను సిద్ధం చేయాలని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి బస్ సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు.

Also Read : కేసీఆర్ విధానాల కార‌ణంగా 24 గంట‌లు విద్యుత్‌

విద్యార్థులుకోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మండల ప్రత్యేక, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లకు పాల్పడకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు వ్రాయాలని చెప్పారు. ఫ్లైయింగ్, సిట్టింగ్, చీఫ్ పర్యవేక్షకులు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పేపర్లు లీకైనట్లు వచ్చే పుకార్లను నమ్మొద్దని, ఇటువంటి పుకార్లపై పోలీస్ శాఖ ద్వారా సైబర్ క్రైం అధికారులు నిశిత పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. వదంతులు నమ్మొద్దని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. పరీక్ష ముగిసే వరకు పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరని చెప్పారు. ఇన్విజిలేటర్లు కు కూడా కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదని చెప్పారు. నిబంధనలు అతిక్రమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి రోజు విద్యార్థుల హాజరు వివరాలపై నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారిని ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube