23 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

23 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

1
TMedia (Telugu News) :

23 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

టీ మీడియా ,మార్చి 22 ,హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,57,393 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. 1,882 పరీక్షా కేంద్రాలను ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసింది. వీరిలో 2,57,081 జనరల్‌ కేటగిరి అభ్యర్థులుండగా, మరో 312 జాగ్రఫీ అభ్యర్థులున్నారు. ఒక కాలేజీ అధ్యాపకులకు మరో కాలేజీలో ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్స్‌గా నియమించారు. ఏ రోజు జరిగిన పరీక్షలకు సంబంధించిన మార్కులనే అదే రోజు బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఏర్పాట్లు చేసింది.
పరీక్షల నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేయగా, మంగళవారం నుంచే ఈ కంట్రోల్‌రూం సేవలందిస్తుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. 040 -24600110 ఫోన్‌ నంబర్‌, hepldesk-ie@telangana.gov.in ఈ మెయిల్‌ను సంప్రదించాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసే ఈ కంట్రోల్‌రూం సేవలను విద్యార్థులు, ప్రిన్సిపాళ్లు వినియోగించుకోవాలని సూచించారు.

Also Read : మానవత్వం ప్రదర్శించిన పోలీసులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube