స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
టీ మీడియా, అక్టోబర్ 31, అమరావతి : స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుచేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. స్కిల్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్‌తోపాటు.. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 9న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును నంద్యాలలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఏసీబీ కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
Also Read : సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారు : ఢిల్లీ మంత్రి ఆతిషి
అప్పటి నుంచి చంద్రబాబు లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తూ వచ్చినప్పటికీ ఏసీబీ కోర్టు తిరస్కరిస్తున్నది. ఈ నేపథ్యంలో అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నేడు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. మొత్తంగా 52 రోజులపాటు రాజమండ్రి జైలులో చంద్రబాబు గడిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube