టీ మీడియా దమ్మపేట డిసెంబర్ 27
దమ్మపేట మండలంలోని జూనియర్ కళాశాల కు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షత న ఈ మధ్య కమిటీ వేసిన అనంతరం కమిటీ సభ్యులు సోమవారం కొత్తగూడెం లోని జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారిణి సులోచన ని కలసి తీర్మాన కాపీ ని అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆమెతో మాట్లాడుతూ కళాశాల కు సంబంధించిన అనుమతి కమిషనర్ ద్వారా త్వరితగతిన నిర్వహించ గలరని,వచ్చే విద్యా సంవత్సరం జూన్ 1 నుండి జూనియర్ కళాశాల పక్క భవనం లో నిర్మిచుకోవటానికి దాతల సహాయం తో కొంత నిధిని కూడా సేకరించమని మీ అనుమతి ఇస్తే చాలని కోరారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దార యుగంధర్,రావేళ్ళ అజయ్ కుమార్,చిన్నంశెట్టి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.