36 డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

టీ మీడియా,మార్చి, 08

0
TMedia (Telugu News) :

36 డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

టీ మీడియా,మార్చి, 08,ఖమ్మం : మహిళల అభివృద్ధి కొరకే దోహదపడుతున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడో పట్టణం గాంధీచౌక్ ఉమెన్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో 36 డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు , ఆశా వర్కర్లకు , ఆయాలకు , ఆర్పీలకు , మహిళ మున్సిపాలిటీ కార్మిక సిబ్బంది లను ఘనంగా శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకన్న పాల్గొని మాట్లాడారు మాతృమూర్తులను గౌరవించి వారికి తగిన గౌరవాన్ని అందించి సమాజంలో స్వశక్తిగా ఎదిగిన మహిళలు అభివృద్ధి కొరకు పురుష సమాజమంతా పాటుపడాలని అన్నారు . స్త్రీ శక్తిలేనిదే జీవన మనుగడ లేదని అన్ని రంగాల్లో ముందుకు రావడానికి పురుష సమాజం దోహదపడాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో 36వ డివిజన్.
అంగన్వాడీ టీచర్స్ : అంజురా , అలివేలు , రాజ్యలక్ష్మి , నాగ వాణి , ఆయాలు : జె. రేణుక, శేషమ్మ , ఉప్పలమ్మ , మహిళల మున్సిపల్ సిబ్బంది : జె .సుగుణ , ఎస్. ఆదిలక్ష్మి , టీ.సుజాత , టి. ప్రవళిక , యం. భూలక్ష్మి , ఆర్ పి లు : భారతి , ఝాన్సీ , కనకలక్ష్మి , అరుణ మరియు డివిజన్ కార్యకర్తలు పిల్లుట్ల కృష్ణ , తోట రంగారావు , మామిడి వెంకటేశ్వర్లు , నేరెళ్ల ఉపేందర్ , దుగ్గి వీరేష్ , ఎస్. సత్యం , ఎన్. సి. హెచ్ లు : పద్మజ , సట్టు లక్ష్మి గోపి తదితరులు పాల్గొన్నారు

POLICE

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube