జాతీయ బహుమతి సాధించినందుకు సన్మానం
టి మీడియా,మర్చి 12, గోదావరిఖని :
జాతీయ బొగ్గుగనుల రక్షణలో 2&2ఏ గని కి జాతీయ బహుమతి సాధించినందుకు సన్మానం
శనివారం గనిపై జరిగిన కార్యక్రమంలో జాతీయ రక్షణ బహుమతి అందుకున్న ఏజెంట్ శ్రీనాథ్, కారం సత్తయ్య లను అధికారులు,ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గని ఏజెంట్ శ్రీనాథ్,మేనేజర్ రామస్వామి మాట్లాడుతూ…సింగరేణి కోల్ ఇండియా బొగ్గు గనుల లోనే కాకుండా జాతీయస్థాయిలో ఉత్తమ రక్షణ గని గా సాధించినందుకు ఉద్యోగులకు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే రాబోయే రోజులలో కూడా రక్షణతో కూడినఉత్పత్తి సాధించి మరెన్నో అవార్డులు అందుకోవాలని, కార్మికులు అందరూ గనిలోపల ఐక్యత గా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గని టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ దాసరి నర్సయ్య,2ఎ గని ఫిట్ సెక్రెటరీ దొరగండ్ల మల్లయ్య,గని ఇంచార్జ్ మాధవ రెడ్డి,రక్షణ అధికారి వెంకటేశ్వర్లు,సంక్షేమ అధికారి గణేష్ నాయక్, టీబీజీకేఎస్ ఫిట్, సేప్టీ కమిటీ,అన్ని సంఘాల నాయకులు,అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Also Read : పదోన్నతులు పొందిన కానిస్టేబుళ్లను అభినందించిన:సీఐ
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube