రాజాలింగు కు ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డు
టీ మీడియా, ఆగస్టు 6, రామకృష్ణపూర్:
క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన అడ్వకేట్ రాజలింగు మోతే కు ఇంటర్ నేషనల్ ఐకానిక్ అవార్డు,ఉత్తమ ఫ్యామిలీ కౌన్సిలర్, ఆర్బిట్రేటర్ లభించింది.పట్టణంలో సఖ్యత ఫ్యామిలీ కౌన్సిలింగ్ & ఆర్బిట్రేషన్ సెంటర్ ను నడిపిస్తూ, కుటుంబ కలహాలను, పౌర వివాదాలను పరిష్కరిస్తున్నందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును స్థానిక ఎస్సై బి. అశోక్ చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్బంగా ఎస్సై రాజలింగు మోతే ను అభినందించారు.అనంతరం రాజలింగు మోతే మాట్లాడుతూ కుటుంబ కలహాల పరిష్కారం కొరకు ప్రతి శని,ఆదివారాలలో తమ కేంద్రంలో సంప్రదిస్తే, పరిష్కార మార్గాలు చూపెడతామని ఆయన తెలిపారు.ఈ అవకాశాన్ని రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.