మిషన్ స్మైల్ సంస్థ కి మరో అరుదైన గౌరవం

మిషన్ స్మైల్ సంస్థ కి మరో అరుదైన గౌరవం

2
TMedia (Telugu News) :

మిషన్ స్మైల్ సంస్థ కి మరో అరుదైన గౌరవం

ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డు తో పాటు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు
టీ మీడియా,జూన్ 14, పెద్దపల్లి :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల రక్తదానాలు,పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ కు ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డు 2022 తో పాటు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకుంది..

Also Read : అందుబాటులో కి రానిపాఠ్యపుస్తకాలు

నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫొరం ఆధ్వర్యంలో అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ డి ఎం, హెచ్ వో జువేరియా ,ఎన్ వై పి స్టేట్ కో ఆర్డినేటర్ యాదవరాజు,కరీంనగర్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్,చేతులమీదుగా మిషన్ స్మైల్ ఆర్గనైజేష ప్రధాన కార్యదర్శి పూసాల అఖిల్,కోశాధికారి బత్తిని అనిల్ కుమార్, షీల్డ్,మెడల్,సర్టిఫికెట్స్ అందుకోవడం జరిగింది.

Also Read : రిజిస్ట్రేషన్ ఆఫీస్ తక్షణమే మార్చాలి

ఈ సందర్భంగా మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి పూసాల అఖిల్ మాట్లాడుతూ..ఈ గౌరవం మాలో బాధ్యతల్ని మరింత పెంచింది అని ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క మిషన్ స్మైల్ సంస్థ సభ్యునికి ఈ అవార్ద్ అంకితం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిషన్ స్మైల్ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్,క్రియాశీలక సభ్యులు ప్రశాంత్,అజయ్,సాయికుమార్,తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube