అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
టీ మీడియా, మార్చి 8,ములుగు బ్యూరో: జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశాన్ని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు.ఈ సమావేశానికి మహర్షి విద్యా సంస్థల కరస్పాండెంట్ తుమ్మ పిచ్చి రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆర్థిక శాస్త్ర అధ్యాపకులు మాలోతు సమ్మయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట, ములుగు జెడ్పీటీసీ సకినాల భవాని హాజరైనారు.కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డీ మాట్లాడుతూ సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అందుకు స్త్రీలు మనోధైర్యంతో విద్య, వైద్య, సామాజిక రంగాలలో ముందుకు రావాలని సూచించారు. చట్టసభల్లో కూడా స్త్రీలకు పురుషులతో సమానంగా అవకాశాలను కల్పించినప్పుడే స్త్రీలు సమాజంలో అభివృద్ధి చెందుతారని సూచించారు.
మాలోత్ సమ్మయ్య మాట్లాడుతూ స్త్రీలు అభివృద్ధి చెందాలంటే చదువు ఒక ముఖ్యమైన ఆయుధమని సూచించారు. ములుగు జెడ్పీటీసీ మాట్లాడుతూ మహిళలు అన్ని డిపార్ట్మెంట్ లలో వృత్తి చేయడం జరుగుతోంది.ప్రతి మహిళ అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.అనంతరం మహర్షి కళాశాల మహిళ అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ కుమార్ అధ్యాపకులు సుధాకర్, శాంతకుమార్,రజిత,కళావతి, పద్మజారాణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.