ఇంటర్నేషల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న కార్పొరేటర్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్ 23, గోదావరిఖని :

గోదావరిఖని దుర్గానగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బొడ్డు రజిత-రవిందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో ఇంటర్నేషల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ను అందుకున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత-రవీందర్ దంపతులు

ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా వచ్చినా ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ తెలంగాణ ప్రతినిధి డాక్టర్ రంగ జ్యోతి ముఖ్య అతిథిగా వచ్చి మాకు అందజేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా మా డివిజన్ ను పొల్యూషన్ నుండి రక్షించుకోడానికి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు వచ్చి మొక్కలు నాటాలని పిలుపునివ్వడంతో వచ్చి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు,శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ…ఈ అరుదైన రికార్డ్ ను అందుకున్న బొడ్డు రజిత-రవిందర్ ను అభినందిస్తున్నామన్నారు.ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ…12 వ డివిజన్ 5 ఇంక్లైన్, విత్తలనగర్,ఏరియా లో పొల్యూషన్ ఎక్కువ ఉన్నదని గ్రహించి కేసీఆర్ ఆదేశాల మేరకు హరిత హారం లో భాగంగా ప్రజలతో కిలిసినిర్వహించిన జీ వన మహోత్సవం అనే ఈ కార్యక్రమానికి బొడ్డు రజిత-రవీందర్ లకు రికార్డ్ ను ప్రదానం చేసిన సందర్భంగా వారిని అభినందిస్తున్నామన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో రామగుండం అంత కూడా హరిత రామగుండం మార్చాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమములో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు జడ్పీటీసీ ఆముల నారాయణ,కార్పొరేటర్ లు ఎంపీటీసీ లు టిఆర్ఎస్ నాయకులు 12 వ డివిజన్ యూత్ సభ్యులు సందవేన కుమార్,గుండెబోయిన శ్రీనివాస్,కుంచెం శ్రీకాంత్, లంక దాసరి హరికృష్ణ, పత్యం పవన్,తదితరులు పాల్గొన్నారు.

International Wonder Book of Records.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube