రూ.3 .90 కోట్లుతో ఇంటిగ్రేటెడ్ మార్కెట

కలెక్టర్ భారతి హోళికేరి..

1
TMedia (Telugu News) :

రూ.3 .90 కోట్లుతో ఇంటిగ్రేటెడ్ మార్కెట
-కలెక్టర్ భారతి హోళికేరి..

టి మీడియా ఏప్రిల్ 09,లక్షెట్టిపేట:ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలకంగా మారనున్నదని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.3 కోట్ల 90 లక్షలతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భూమి పూజ చేసి,శంకుస్థాపనను ఎమ్మెల్యే దివాకర్ రావు తో కలిసి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతుమున్సిపాలిటీ లో అభివృద్ధి దశల వారీగా జరుగుతుందని, మొత్తం 42 అంశాలను ప్రాతిపదికగా అభివృద్ధి సూచికను నిర్వహిస్తామన్నారు.దీనిలో భాగంగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో కూరగాయలు, పండ్లు,మాంసాహార ఇతర వస్తువులను విరివిగా కొనుగోలు చేయవచ్చన్నారు.శాస్త్రీయ పద్దతిలో మార్కెట్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తాజా నిత్యావసర ఉత్పత్తులు ప్రజలకు లభిస్తాయని పేర్కొన్నారు. రోడ్ల పై పెట్టి అమ్మే కూరగాయలు సూక్స్మ జీవుల బారిన పడి ప్రజలకు ఆనారోగ్యం కలిగించే అవకాశాలు వుంటాయని వివరించారు. అంతేకాకుండా కొన్నిసార్లు మాంసాహార ఉత్పత్తులను నిల్వ చేసే అవసరాన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోని ఏర్పాట్లతో అధిగమించవచ్చన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కి కట్టుబడి ఉందన్నారు.

Also Read : ఆర్టీసీ ఛార్జీలు పెంచింది

లక్షెట్టిపేట్ కు పూర్వ వైభవాన్ని తెస్తామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. కళ్యాణ లక్ష్మీ,ఆసరా,ఉచిత విద్యుత్, రైతు బంధు,రైతు భీమా పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. అదే విధంగా ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందని వివరించారు. అనంతరం కలెక్టర్ మున్సిపాలిటీ లోని నర్సరీ ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,టీ ఆర్ ఎస్ పట్టణాధ్యకుడు పాదం శ్రీనివాస్, మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు గొడిశెల లక్ష్మీ, మెట్టు కళ్యాణి, సుధాకర్,సురేష్,మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య,మాజీ డీసీఎంఎస్ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు జగన్ మోహన్ రెడ్డి, మెట్టు రాజు,వెంకట్స్వామిగౌడ్,గడుసురమేష్ ,మోటపలుకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube