ద్రౌపది ముర్ముపై కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు

ద్రౌపది ముర్ముపై కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు

1
TMedia (Telugu News) :

ద్రౌపది ముర్ముపై కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు

టి మీడియా, జూన్25,భువనేశ్వర్‌: ‘మా అమ్మ అత్యంత సహనశీలి. కష్టం, విషాదంతో అన్ని తలుపులు మూతబడిన విపత్కర పరిస్థితుల్లో సడలని మానసిక స్థైర్యం కలిగిన సాహసి అమ్మ ద్రౌపది ముర్ము. ఒడిదుడుకులను సహనంతో ఎదురీది దేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆమె నాకు సదా మార్గదర్శకం’. ఇదీ… జాతీయ గణతంత్ర కూటమి తరఫున భారత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము(35) తన తల్లిని ఉద్దేశించి, వెల్లడించిన అభిప్రాయం. ద్రౌపది ముర్ముకు 3 నెలల మనవరాలు ఉంది. శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు ముందు ఆమె కుమార్తె, మనవరాలితో కలిసి, కొద్దిసేపు ముచ్చటించారు.

 

Also Read : వలు, ఊదలతో నోరూరించే రుచులు.. కొంచెం కారం, కొంచెం తీపి!

 

తొలుత ఫోన్‌ ద్వారా..
భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ తరఫున ద్రౌపది ముర్ము పేరు ఖరారైన విషయం తొలుత ఫోన్‌ ద్వారా తెలిసింది. ఆ సమయానికి గ్రామంలో కరెంట్‌ కోత ఉండడంతో టీవీ ప్రసారాన్ని చూడలేక పోయారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ శుభవార్తను తొలుత తెలియజేయడంతో ఆమె అవాక్కయ్యారు. 2017లో కూడా రాష్ట్రపతి అభ్యర్థిత్వం చివరి క్షణంలో చేజారిపోయింది. ఈసారి కలిసి వస్తుందని ఊహించలేక పోయారు. బరిలో నిలవడం నిజం కావడం ఆనందదాయకంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయినిగా సాధికారతకు శ్రీకారం చుట్టి, తరచూ ప్రజాహిత, సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకొని.. క్రమంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడారు.
కౌన్సిలర్‌ స్థాయి నుంచి అత్యున్నత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచే వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. బీజేపీ అభ్యర్థిగా వరుసగా 2సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2000లో బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య రవాణా, మత్స్య, పశు సంవర్థక శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. 2015లో ఝార్కండ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె పనితీరుపై కేంద్రం సంతృప్తికరంగా ఉండటంతో ఆరేళ్లకు పైగా 2021 వరకు అదే బాధ్యత్లో కొనసాగారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube