కులవివక్షత పై నిందితులకు శిక్షపడేల దర్యాప్తును పూర్తిచేయాలి

- పోలీస్ శాఖకు తెలంగాణ లోకాయుక్త ఆదేశాలు

0
TMedia (Telugu News) :

కులవివక్షత పై నిందితులకు శిక్షపడేల దర్యాప్తును పూర్తిచేయాలి

– పోలీస్ శాఖకు తెలంగాణ లోకాయుక్త ఆదేశాలు

టీ మీడియా, డిసెంబర్ 21, రేవల్లి : కులవివక్షతకు గురై బాధితుడు పిర్యాదు చేసి ఏడాది గడుస్తున్న కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకోవడం ఏంటని, ప్రశ్నిస్తూ వెంటనే నిందితులకు శిక్షపడేల దర్యాప్తును పూర్తిచేయాలని తెలంగాణ లోకాయుక్త వనపర్తి డి ఎస్ పి ఆనంత రెడ్డి ని ఆదేశించింది. ఇందుకు సంభందించిన వివరాల ప్రకారం రేవల్లి మండల కేంద్రానికి చెందిన ఎంఏ. సలాం మజాహిద్ ను అదే గ్రామానికి చెందిన ప్రస్తుత మండలపరిషత్ కో అప్షన్ ఎండి. ఖాజ, అతని అనుచరులైన ఎండి. శాళీ, ఎండి. సలీం లపై కులవివక్ష చూపి అవమానించారని, పండుగలకు మసీదులో ప్రార్తనలు, శుభాకార్యాలలో పాల్గొంటున్నతన కుటుంభ సభ్యులను అవమానించారని, వివిధ సంఘటనలు తెలుపుతూ 2022 నవంబర్ నేలలో స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా అప్పటి ఎస్ ఐ మల్లేష్ పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్ పి, కలెక్టర్ లకు పిర్యాదుచేయగా అట్టి విచారణలో ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ జానకిరాం రెడ్డి తన అనుచరలతో తలదూర్చి కేసు ముందుకు సాగకుండా చేయడంతో, పిర్యాదు దారుడు సలాం మజాహిద్ న్యాయవాది సహాయం తో వనపర్తి కోర్టులో ప్రవేటు కేసు వేసి న్యాయం చేయాలకి కోరుతూ..

Also Read : సీఐఎస్ఎఫ్ చేతుల్లోకి పార్ల‌మెంట్ భ‌ద్ర‌త

న్యాయస్థానాన్ని, రాష్ట్ర లోకాయుక్తకు పిర్యాదు చేయడం తో రెండు నెలల క్రితం కంటితుడుపు చర్యగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చెసి నెలలు గడుస్తున్నా చార్జ్ షీట్ నమోదు చేయక పోవడంతో గురువారం కోర్టు వాయిదాలో పాల్గొన్న బాధితుడు సలాం విషయాన్నీ న్యాయస్తానం దృష్టికి తీసుకెళ్లాగా త్వరగా చార్జ్ షీట్ నమోదు చెసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి డిఎస్పి అనంతరెడ్డిని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఆదేశం పట్ల బాధితుడు సలాం మజాహీద్ తనకు న్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశాడు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube