తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం

0
TMedia (Telugu News) :

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం

టీ మీడియా, జనవరి 17, హైదరాబాద్ : దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. పలు ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. పలు సంస్థలు తమ కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించాయి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ పెప్సికో సంస్థ ఉపాధ్యక్షుడు రాబర్డో అజేవేడోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంస్థ కార్యకలాపాలు రెట్టింపు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 2019లో 250 మందితో ప్రారంభమైన గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 2800 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఖ్యను 4వేలకు పెంచనున్నట్లు చెప్పారు.

Also Read : లా విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం

ఏడాదిలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామని చెప్పారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సీకో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపై రాబర్టోతో కేటీఆర్‌ చర్చించారు. పెక్సికో నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube