వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 11, మహానంది:

మహానంది మండలంలోని సీతారాంపురం గ్రామ సచివాలయం, నంది పల్లి యందు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు, ఖాళీగా ఉన్న రెండు వాలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఎంపీడీఓ సుబ్బరాజు శనివారం తెలిపారు.ఖాళీగా ఉన్న రెండు వాలంటీర్ పోస్టులను భర్తీ చేయుటకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.
సీతారాంపురం గ్రామ సచివాలయము నందు బిసి పురుషుడు, నందిపల్లె ఎస్సీ మహిళ మొత్తం రెండు గ్రామ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ రోజు నుండి సోమవారం లోగా ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకొని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ సుబ్బరాజు తెలిపారు.

Invitation to apply for volunteer posts.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube