పత్తి వ్యాపారి దివాళా పిటిషన్ దాఖలు
ఖమ్మం పట్టణం నకు చెందిన మిర్చి , పత్తి కమీషన్ వ్యాపారి పగడాల రామారావు స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లో ఒక కోటి 85 లక్షల 95వేల 467 రూపాయల కు మొత్తం 44 మంది ని ప్రతివాదులు గా చూపిస్తూ మంగళవారం దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. వివరాలు పిర్యాది దారునిది మహబూబాబాద్ జిల్లా , డోర్నకల్ మండలం , తోడెలగూడెం గ్రామానికి చెందిన వాడు. ఇతను ఖమ్మం వచ్చి ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మార్కెట్ లలో మిర్చి , పత్తి ని కొనుగోలు చేసేవాడు. ఈ వ్యాపారాన్ని అబివృద్ది చేయడం కోసం బంధువుల దగ్గర , స్నేహితులు దగ్గర అధిక *వడ్డీలకు అప్పులు తీసుకుని వ్యాపారం లో నష్టం రావడం తో తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక ప్రతివాదుల నుండి ఓత్తిడి అధికమవడంతో తన న్యాయవాదులు నేరేళ్ళ శ్రీనివాసరావు , సురేష్ ల ద్వారా ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు.