ఎల్ఐసిలో ఐపీఓ రద్దు చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 10 వనపర్తి : ప్రభుత్వరంగ ఎల్ఐసి లో వాటాల ఉపసంహరణ కోసం ఉద్దేశించిన ఐపిఓ ని రద్దు చేయాలని వివిధ భీమా ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐపిఓ పథకం వల్ల జరిగే నష్టం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను డిసెంబర్ 10న శుక్రవారం రోజు వనపర్తి లోని ఎల్ఐసి ఆఫీస్ లో ఆవిష్కరించారు. గత 60 సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో వాటాలు ఉపసవరణ తగదని వారు పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారని వారు ఆరోపించారు. ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటేనే ప్రజల ప్రయోజనాలు నెరవేరతాయని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అందుతాయని వారు వివరించారు.

రైతన్నల పోరాటానికి తలొగ్గి వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్నట్టుగానే ప్రభుత్వరంగ సమస్యల ప్రతిపాదనలను విరమించుకోవాలని ఏఐఐఏఏ జిల్లా అధ్యక్షుడు బద్రినాథ్ జిల్లా కార్యదర్శి నరసింహ సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, బిసన్న, చంద్రశేఖర్ సిఐటియు నాయకులు గోపాలకృష్ణ రాములు జీవిత బీమా సంస్థ వనపర్తి శాఖ ఏజెంట్లు ఉద్యోగులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube