ఇరాన్ మానవహక్కుల కార్యకర్తకి -నోబెల్ శాంతి పురస్కారం
ఇరాన్ మానవహక్కుల కార్యకర్తకి -నోబెల్ శాంతి పురస్కారం
ఇరాన్ మానవహక్కుల కార్యకర్తకి -నోబెల్ శాంతి పురస్కారం
టీ మీడియా, అక్టోబర్ 6,స్టాక్ హోం : ఇరాన్ మానవహక్కుల కార్యకర్త నర్గెస్ మొహ్మదికి నోబెల్ శాంతిపురస్కారం దక్కింది. మహిళల అణివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఆమెను ఈ అవార్డుతో గౌరవిస్తున్నట్లు నోబెల్ జ్యూరీ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు.ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం మరియు అందరికీ స్వేచ్ఛను అందించేందుకు నర్గెస్ చేసిన పోరాటానికి గాను ఈ ఏడాది శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్లు జ్యూరీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె 13 సార్లు అరెస్టవగా, ఐదు సార్లు దోషిగా తేలారు. మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు తిన్నట్లు పేర్కొంది. ఆమె మహిళల హక్కులు మరియు మరణశిక్ష రద్దు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.