అండర్-19 జాతీయస్థాయి పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించిన గూడెం వీరుడు
టీ మీడియా,నవంబర్30,కరకగూడెం:
ఏజెన్సీ కరకగూడెం మండలంలోని కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కలవల నాగారం గ్రామం ఇర్ప వెంకటనర్సయ్య-నాగమణి ఆదివాసి గిరిజన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఇర్ప నాగకృష్ణ.ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ భద్రాచలం డిగ్రీ కళాశాల నందు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.పరుగు పందెం అంటే ఎంతో ఇష్టం.పరుగు పందెంలో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో గోవాలో జాతీయస్థాయిలో జరిగినటువంటి 5వ నేషనల్ యూత్ గేమ్స్ లో తెలంగాణ రాష్ట్ర తరపున ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రాతినిథ్యం వహించాడు.
రన్నింగ్ 5 కిలోమీటర్ల విభాగంలో బంగారు పతకం (వ్యక్తిగత),4×100 రిలే భాగంలో మరో బంగారు పతకం సాధించాడు.
ఈ సందర్భంగా
టీ మీడియా ఆ విద్యార్థిని పలకరించగా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎన్నో ఆటు పోట్లు,ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సిచ్చింది.అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లి తెలంగాణరాష్ట్ర తరపున బంగారు పతకం సాధించాలనే పట్టుదల నా విజయానికి కారణం అయింది.తెలంగాణ రాష్ట్ర తరపున ఈ మెడల్ సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉందని,ఈ పతకం తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను.నాకు సహకరించిన మా కళాశాల పి ఈ డి రాకేష్ మాస్టర్ కు,గ్రామస్తులకు,తోటి స్నేహితులకు, గోవా వెళ్లడానికి ఆర్థికంగా ఆదుకున్న దాతలకు ప్రత్యేకంగా రుణపడి ఉంటానని తెలిపారు.
భవిష్యత్తులో దేశం తరపున రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.దీని కొరకు నిరుపేదనైన నాకు మంచి స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని సూచించాడు.
ప్రభుత్వం తరపున మెరుగైన శిక్షణ ఇస్తే మరెన్నో బంగారు పతకాలు సాధించి మన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తెస్తానని అన్నాడు.నాగకృష్ణ ఈ ఘనత సాధించినందకు పలువురు అభినంధిచారు.