అక్రిడేషన్ జారీ మార్గ దర్శకాల్లో అక్రమాలు
– అనర్హులు కు అమ్ము కొనేందుకు అవకాశం
– అసలు వృత్తిదారులు కు అన్యాయం
– నోరు మెదపని సంఘాలు నేతలు
టీ మీడియా,ఫిబ్రవరి16,ప్రత్యేక ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టు వృత్తి దార్లకు ప్రభుత్వ పరమైన గుర్తింపు ఇచ్చే అక్రి డేషన్ జారీ మార్గ దర్శకాలు పూర్తి లోప భూ ఇష్టం గా ఉన్నాయి..ఎవరి నీ జర్నలిస్టు లు గాగుర్తించాలి అన్న ది ప్రతిపాదించే అధికారం మీడియా సంస్థ ల కు అప్పగించి,వారు ఇచ్చిన లిస్ట్ ను పరిశీలించి ఆమోదించే పనిని రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న వారు నియమించే కమిటీ కి అధికారం ఇచ్చారు.ఈ రెండు దశల్లో ఎక్కడ క్షేత్ర స్థాయి విచారణ అనేది ఉండదు. అక్రిడేషన్ ప్రాతి పదికన నే సంక్షేమ పదకాలు అమలు,ప్రభుత్వ పరమైన వి ఐపి ల కార్యక్రమాలు కు జర్నలిస్టు ల హాజరు అనుమతి లాంటి వి చేస్తున్న రు.ఇక్కడే అసలు తిరకాసు ఉంది .అడ్డ దారిలో కార్డు పొందిన వారు,అందలం ఎక్కు తుండగా నిజమైన వృత్తిదారులు కు అన్యాయం జరుగుతోంది.. ఇంతటి ఘోరం కు మూలం అయిన అక్రిడే షన్ జారీ కి కేంద్రం రూపొందిన గైడ్ లైన్ లు గురించి సంఘాలు,నేతలు గా చాలామని అయ్యేవారు మాట్లడరు..నిజమైన జర్నలిస్టు ల కు అన్యాయం జరుగుతోంది అని స్థానికప్రభుత్వాలను,స్థానిక అధికార యంత్రాగం ను నిందించటం,ఆందోళన లు చెయ్యడం పరి పాటి గా మారింది. ఉనికి కోసం చేసే ఉద్యమాలు గా మారాయి.గైడ్ లైన్ ల మార్పు అనే అంశం ఆందోళన లో ఎక్కడ కనిపించదు.
ఉదాహరణకు…
జర్నలిస్ట్ వృత్తి దారులు అందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి అన్నది తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష..అర్హులు అయిన ప్రతి ఓక్కరి ఇస్తాము అన్నది ముఖ్య మంత్రి హామీ.అమలు ఆరంభం అయింది..
అర్హత:మొదటిది ఎవరు జర్నలిస్ట్ అంటే: అక్రీడేషన్ ఉన్నవారు మాత్రమే జర్నలిస్ట్.ఇందుకుసమాచార శాఖ వద్ద ఉన్న లిస్ట్ ప్రాతిపదిక.
Also Read : ప్రణాళికాచరణతో పరీక్ష్యల్లో అధ్భుత ఫలితాలు
రెండు:పై జర్నలిస్టుల లిస్ట్ లో అర్హులు ఎవరు అన్నది రెవిన్యూ యంత్రాగం తో క్షేత్ర స్థాయి విచారణ చేస్తున్న రు..అందుకు ప్రాతిపదిక:1,స్థానికత,2, దారిద్ర రేఖకు దిగువన,3,గతం లో ప్రభుత్వం నుండి పొందిన లబ్ధి,ఇళ్ళ స్థలం పొందారా..?4,కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు గా ఉన్నారా,5, ఆస్థులు ,ఆర్థిక పరిస్థతులపై లాంటి మరికొన్ని రొటీన్ గైడ్ లైన్ లు ప్రాతి పదికన విచారణ చేస్తున్నారు.
అతను జర్నలిజం వృత్తి లో ఉన్నడా,సమాచారం సేకరణ,వార్తలు రాయడం వచ్చా, నిజమైన వృత్తిదారుడా, అక్రిడేషన్ అర్హత ఉండి పోందారా అన్నది ఉండదు.ఎందు కంటే మొదటి దశ లో అర్హత పొందారు.కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు అయిన కమిటీ ఆమోదించి అతనిని జర్నలిస్టు గా గుర్తించింది దానిపై విచారణ ఉండదు.చేస్తే కమిటీని అవమాన పర్చడం అవుతుంది.. వాస్తవంగా ఆధార్ ఆధారంగా రెండో దశ అర్హత నిర్దారణ కు రావచ్చు. చెయ్యరు.అందుకు అనేక కారణాలు ఉన్నయి. రెండో దశ లో పాస్ అయితే అతను అర్హుడు .
అక్రిడేషను దరకస్తులు ను ఇదే తరహాలో క్షేత్ర స్థాయి విచారణ చేయించి.ఆ నివేదికను కమిటీ పరిశీలన చేస్తే కొంత వరకు అయిన నిజమైన వృత్తి దారులుకు న్యాయం జరుగుతుంది..
ఓకసారి గుర్తింపు వస్తె..
కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గ దర్శకాల్లో మరొక లోపం.5 యేళ్లు అక్రిడే షన్ ఉంటే అతని కి ఇండి పెండెంట్ జర్నలిస్ట్ గా గుర్తింపుకు అర్హత ఉంది. అంటే అడ్డ తోవలో ఓకసారి. కార్డు పొందితే 2 యేళ్లు కుఇస్తారు . మరో ఏడాది పొడిగిస్తారు.అప్పటి కే 3 యేళ్లు అయి పోతుంది.మరో రెండు యేళ్లు కు అడ్డ తోవలో పొందితే .జీవిత కాలం జర్నలిస్ట్ గా అర్హత సాధించినట్లే. ఈ క్రమం లో నే అక్ట్రి డెషన్ కార్డులు పొందిన వారి సంఖ్య పెరిగిపోతోంది.ఆ సంఖ్య నిజమైన వృత్తిదారులు సంఖ్య కు అసలు పొంతన లేదు. నిజమైన వారిలో 50 శాతం మంది కు కూడా కార్డులు లేవు. మా పాలన లో ఇన్ని అక్త్రి డే ష న్ కార్డులు ఇచ్చాము చుసారా.?అని చెపుతారా తప్ప మేము క్షేత్ర స్థాయి విచారణ చేశాము అని క్వాలి టీ గురించి,జర్నలిస్ట్ సంఘాలు,నేతలు మాట్లడరు.కారణం సంఘాలు,నేతల్లోనూ కొంతమంది నకిలీలున్నరు.
Also Read : ఆ క్షేత్రాల సందర్శనకు స్పెషన్ టూర్ ప్యాకేజీలు..
– అసలైన జర్నలిస్ట్ వారు డెస్క్ అయిన, ఫీల్డ్ అయిన అక్ట్రిడేష న్ అనేది కొనుక్కొడు. వీలుంటే అడుకొంటాడు.అవసరమయితే పోరాటం చేస్తాడు.ఇటువంటి వారి వద్ద కొనుకొంటానికి డబ్బులు ఉండవు.. నకిలీ లు మాత్రం డబ్బును నమ్ముకొని అర్హత పొందుతాడు కాబట్టి వారికి వృత్తి ఏమైనా పర్వ లేదు.వృత్తి కాకుండా డబ్బును నమ్మిన వాడు .డబ్బు ఉన్న ఇటువంటి ప్రయోజనాలు కాపాడేందుకు,వారి కి పెద్ద పీట ..కొన్ని ,సంఘాలు నేతలు వేస్తూ నాయకులు గా చెలామణి అయ్యే వారు ఆర్థిక వెసులు బాటు పొందుతారు..అన్నింటికీ మూలం అయిన అక్ట్రిడేషన్ జారీ ప్రక్రియ నిబంధనలు లో మార్పు వస్తే నే,నిజమైన జర్నలిస్టు వృత్తి దారులు కు సంక్షేమం విషయం లో న్యాయం జరుగుతోంది. సమస్య కు శాశ్విత పరిష్కారం వస్తుంది.. పై విషయం లు చర్చ పెడితే .ఇప్పుడు ఇవి అన్ని సాధ్యం కాదు..ఇక అగు అని నాకు హెచ్చరికలు చేసిన వారున్నారు..
ఇకనైన నిజమైన వృత్తి దారులు కు కనీసం ఇళ్ళ స్థలాలు విషయం లో న్యాయం జరగాలి,అర్హుల కు ప్రభుత్వ ఫలం అందాలి అంటే..క్షేత్ర స్థాయి లో రెవిన్యూ అధికారు లు తో చేయించే విచారణ లో..పొందిన అక్ట్రిడేషన్ కు అతనికి ఉన్న అర్హత,చేస్తున్న వృత్తి ఆధారంగా నిర్దారణ చేసే అంశం చేర్చాలి.దీనికి జిల్లా స్థాయి లో ఆదేశాలు ఇవ్వవచ్చు .ఇస్తేనే నిజమైన జర్నలిస్టు ల కు న్యాయం జరుగుతుంది..ఆదిశగా ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తూ..
ఇట్లు
శనగపాటి మురళి కృష్ణ
ఇండిపెండెంట్ జర్నలిస్ట్
టీ మీడియా(డిజిటల్ మీడియా)