వాహనాల కొనుగోలులో అవకతవకలపై విచారణ కోరుతూ నిరహార దీక్ష
– మార్కపురి సూర్య
టీ మీడియా, ఏప్రిల్ 17, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ లో వాహనాల కొనుగోలు లో జరిగిన అవకతవకల పై విచారణ కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద నిరాహార దీక్ష ను పూల మాలలు వేసి దీక్షను ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య ప్రారంభించారు.ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ…వాహనాల కొనుగోలు విషయంలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నూతన మున్సిపల్ చట్టం ప్రకారం సుమారు రెండు కోట్ల అవినీతికి పాలకవర్గం అసమర్థత కారణం చేత వెంటనే అవినీతి పాలకవర్గాన్ని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు.
AlsoRead:తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి : పవన్ కల్యాణ్
నగర పాలక సంస్థ లో వాహనాల కొనుగోలు లో ఇంత అవినీతి కి పాల్పడిన అధికారుల పై కాని మధ్యవర్తిత్వం వహించిన టి ఎస్ అగ్రోస్,ఎస్డిఎస్ టెక్నాలజీస్ పై ఏలాంటి చర్యలూ తీసుకోకపోవడం ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేశామని అన్నారు.ఇప్పటికైనా అధికారుల పై చర్యలూ తిసుకోపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన నిద్ర చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు సాదుల శివ,ప్రధాన కార్యదర్శి అసాల నవీన్,రణవేనీ సుధీర్ కుమార్,భుసరపు రాజ్ కుమార్,గొసిక పవన్, వినయ్,సాయికిరణ్, శ్రీకాంత్,వేణు,అంజి తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube