ఘాట్ రోడ్డు మ‌లుపుల‌ను కూడా ప‌ట్టించుకోని .. మితిమీరిన వేగం..

ఘాట్ రోడ్డు మ‌లుపుల‌ను కూడా ప‌ట్టించుకోని .. మితిమీరిన వేగం..

1
TMedia (Telugu News) :

ఘాట్ రోడ్డు మ‌లుపుల‌ను కూడా ప‌ట్టించుకోని .. మితిమీరిన వేగం..

టి మీడియా,మార్చి 28భాక‌రాపేట :ఘాట్ రోడ్డు మ‌లుపుల‌ను కూడా ప‌ట్టించుకోని డ్రైవ‌ర్‌.. పైగా మితిమీరిన వేగం..
భాక‌రాపేట బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై చిత్తూరు జిల్లా అధికారులు స్పందించారు. మితిమీరిన వేగం, డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చిత్తూరు జిల్లా ర‌వాణా శాఖ అధికారులు ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఆ బ‌స్సు ఘాటు రోడ్డులో ప్ర‌యాణిస్తోంద‌ని, అక్క‌డ మ‌లుపులు కూడా ఉన్నాయ‌ని, అవేవీ గుర్తించ‌కుండా, డ్రైవ‌ర్ బ‌స్సును న‌డ‌ప‌డం వ‌ల్లే ఇంత‌టి ఘోర ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు తేల్చి చెబుతున్నారు.ఇక అంత‌టి ఘాట్ రోడ్డులో డ్రైవ‌ర్ బ‌స్సును న‌డుపుతున్న విధానాన్ని కూడా మృతుల కుటుంబ స‌భ్యులు త‌ప్పుప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్డు ఉంద‌ని, బ‌స్సును కాస్త నెమ్మ‌దిగా న‌డ‌ప‌మ‌ని కుటుంబ స‌భ్యులు అడిగినా… డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం చేశార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణ‌మే ఇంత‌టి ఘోర ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు అధికారులు.

Also Read : నూక ఎవ‌రో.. పొట్టు ఎవ‌రో తేలుస్తాం

నిశ్చితార్థ వేడుక కోసం అనంత‌పురం ధ‌ర్మ‌వరానికి చెందిన ఓ కుటుంబం తిరుప‌తి బ‌య‌ల్దేరింది. మ‌ద‌న‌ప‌ల్లె- తిరుప‌తి జాతీయ ర‌హ‌దారిపై భాక‌రాపేట ఘాట్‌రోడ్డు మ‌లుపు వ‌ద్ద లోయ‌లో ప‌డిపోయింది. దాదాపు 100 అడుగుల లోయ‌లో ఈ బ‌స్సు ప‌డిపోయింది. దీంతో డ్రైవ‌ర్‌తో స‌హా 8 మంది అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. 40 మంది గాయ‌ప‌డ్డారు. ఇందులో ఎక్కువ మంది పిల్ల‌లే ఉన్నారు. వీరంద‌ర్నీ తిరుప‌తి రుయా ఆస్ప‌త్రితో పాటు ఇత‌ర ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్ర‌మాదంపై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో స‌హా ప‌లువురు నేత‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube