జుట్టు రాలుతోందా? ఇలా చేశారంటే మీ కురులు పదిలమే

జుట్టు రాలుతోందా? ఇలా చేశారంటే మీ కురులు పదిలమే

2
TMedia (Telugu News) :

జుట్టు రాలుతోందా? ఇలా చేశారంటే మీ కురులు పదిలమే..

లహరి, డిసెంబర్19,ప్రతినిధి : అపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ మధ్యకాలంలో చిన్నా.. పెద్ద.. అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరినీ వేదిస్తు్న్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యను అధిగమించాలంటే.. ఉన్నట్టుండి జుట్టు రాలుతోందా? ఇలా చేశారంటే మీ కురులు పదిలమేఅపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ మధ్యకాలంలచిన్నా..పెద్ద..అనతేడాలేకుండాప్రతిఒక్కరినీ వేదిస్తు్న్న సమస్య జుట్టు రాలడం.

ఈ సమస్యను అధిగమించేందుకు మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్‌లను, షాంపూలు, నూనెలను వాడుతుంటారు. అయినా ఫలితం ఉండదు. నిజానికి అందుకు ఉన్న అనేకానేక కారణాల్లో.. పొల్యూషన్, ఆహార అలవాట్లు, జీవనశైలి, ఒత్తిడి వంటి కారణాలు కూడా ముఖ్యమైనవని అంటున్నారు నిపుణులు. ఐతే కొన్ని పద్ధతులు, జాగ్రత్తల ద్వారా జుట్టు రాలే సమస్యను అధింగమించవచ్చు. అవేంటంటే..జట్టు రాలడానికి కారణాలు తెలుసా..జుట్టు పలుచగా ఉండే వారికి ఎక్కువగా రాలిపోతుంటుంది. వంశపార్యం పర్యంగా వచ్చే జన్యుపరమైన లోపాలు వల్ల కూడా జుట్టు రాలడం, బట్టతల రావడం వంటి సమస్యలు వస్తాయి. స్త్రీలలోనైతే ఐరన్ లోపం, ఋతుక్రమం సక్రమంగా రాకపోవడం, రక్తహీనత, హర్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి కారణాల వల్ల జుట్టురాలిపోతుంటుంది. ఇందుకు కారణాలని చెప్పవచ్చు. వయసు పెరిగేకొద్దీ మహిళలో మెనోపాజ్ సంభవిస్తుంది. ఈ దశలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఊత్పత్తి తగ్గడం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

Also Read : భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్..

జుట్టురాలకుండా ఉండాలంటే..జంక్ ఫుడ్ కి, గ్యాడ్జెట్స్ కీ దూరంగా ఉండాలి. జుట్టును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే జడ బిగుతుగా వేసుకోకూడదు. పడుకునే బెడ్‌పై దిండుకు సిల్క్‌ కవర్‌ వేసుకుంటే వెంట్రుకలకు రాపిడి తక్కువయ్యి, జుట్టు ఊడకుండా ఉంటుంది. హెయిర్‌ స్టైల్స్‌ మరీ ఎక్కువగా చేయించుకోకూడదు. హెయిర్‌ కండీషర్లను వాడేవారు మీ జుట్టు సరిపోయేవి మాత్రమే వాడుకోవాలి. వీటితోపాటు జుట్టు ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube