గాజా సిటీని చుట్టుముట్టిన ఇజ్రాయిల్ దళాలు
– భారత సంతతి సైనికుడి మృతి
టీ మీడియా, నవంబర్ 3, గాజా : గాజా సిటీని ఇజ్రాయిల్ మిలిటరీ చుట్టుముట్టేసింది. గాజా పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న హమాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన నేటికి 28 రోజులైంది. గాజాలో ఇప్పటి వరకు 9 వేల మంది మరణించారు. దాంట్లో 3760 మంది చిన్నారులు ఉన్నారు. అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయిల్ దళాలు ఏకధాటిగా గాజాపై అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. హమాస్‌పై చేస్తున్న దాడుల్లో 1400 మంది మరణించారు. సుమారు 230 మందిని హమాస్ బంధించినట్లు తెలుస్తోంది. గాజా సిటీలోకి తమ దళాలు దూసుకెళ్తుతున్నాయని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యూ తెలిపారు. గాజా స్ట్రిప్ వద్ద జరుగుతున్న ఫైటింగ్‌లో నలుగురు సైనికులు మృతిచెందినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది.
Also Read : నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
దీంతో ఇజ్రాయిల్ సైనికుల మృతుల సంఖ్య 23కు చేరింది. గాజా ఘర్షణల్లో 20 ఏళ్ల భారతీయ మూలాలకు చెందిన ఇజ్రాయిలీ సైనికుడు సర్జెంట్ హలేల్ సొలమన్ మృతిచెందాడు. అతనిది దక్షిణ ఇజ్రాయిల్‌లోని దిమోనా. ఇజ్రాయిల్‌లో ఉన్న 7500 మంది భారతీయ యూద కమ్యూనిటీ ఆ ప్రాంతంలో ఉంటోంది. ఆ ప్రాంతాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube