ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను అభినందించిన ఇస్రో చైర్మన్
ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను అభినందించిన ఇస్రో చైర్మన్
ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను అభినందించిన ఇస్రో చైర్మన్
టీ మీడియా, అక్టోబర్ 16, చెన్నై: ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానందను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందించారు. సోమవారం ఉదయం చెన్నైలోని ప్రజ్ఞానంద నివాసానికి వెళ్లిన ఇస్రో చైర్మన్.. ఆయనకు రాకెట్ నమూనాను బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు ప్రతి భారతీయుడిలానే తాను కూడా గర్వపడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం అతడు ప్రపంచ నంబర్ 15వ ర్యాంకులో ఉన్నాడని, త్వరలోనే ప్రపంచ నంబర్ 1 అవుతాడన్నారు. చెస్‌కు మాలాలు భారత్‌లోనే ఉన్నాయని, మన దేశంలో ప్రారంభమైన పురాతన ఆట అని చెప్పారు. ఇది మనస్సు, తెలివితేటలు, ప్రణాళిక, వ్యూహంతో కూడిన ఆట అని తెలిపారు. అందుకే భారత్ ప్రాచుర్యం పొందిందని వెల్లడించారు. చంద్రునిపై ప్రజ్ఞాన్ డండటంపట్ల గర్వపడుతున్నామని పేర్కొన్నారు.