బీబీసీపై ఐటీ దాడి.. అప్రకటిత ఎమర్జెన్సీ : కాంగ్రెస్
బీబీసీపై ఐటీ దాడి.. అప్రకటిత ఎమర్జెన్సీ : కాంగ్రెస్
బీబీసీపై ఐటీ దాడి.. అప్రకటిత ఎమర్జెన్సీ : కాంగ్రెస్
టీ మీడియా, ఫిబ్రవరి 14, న్యూఢిల్లీ : ఇండియాలోని బీబీసీ ఛానల్‌కు చెందిన ఆఫీసులపై మంగళవారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు స్పందించాయి. బీబీసీ ఆఫీసుపై ఐటీ శాఖ రెయిడ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆ పార్టీ తన ట్విట్టర్‌లో ఆరోపించింది. తొలుత బీబీసీ డాక్యుమెంటరీ రిలీజైందని, ఆ తర్వాత దాన్ని బ్యాన్ చేశారని, ఇప్పుడు బీబీసీఐ ఐటీ దాడులు మొదలుపెట్టారని, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆ పార్టీ తన ట్విట్టర్‌లో విమర్శలు చేసింది. ఇక తృణమూల్ పార్టీ కూడా బీబీసీఐ ఐటీ దాడిని ఖండించింది. ఎంపీ మహువా మొయిత్రా తన ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. బీబీసీ ఆఫీసుపై జరుగుతున్న ఐడీ దాడి నిజమేనా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇంత అకస్మాత్తుగా ఎలా ఈ దాడి చేశారని ఆమె తన ట్వీట్‌లో తెలిపారు. సెబీ ఆఫీసులో అదానీకి స్నాక్స్ ఇస్తూ.. బీబీసీ ఆఫీసులో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read : మహిళలను ఢీకొట్టిన వాహనం.. ఐదుగురు మృతి
ఇక తృణమూల్ పార్టీ కూడా బీబీసీఐ ఐటీ దాడిని ఖండించింది. ఎంపీ మహువా మొయిత్రా తన ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. బీబీసీ ఆఫీసుపై జరుగుతున్న ఐడీ దాడి నిజమేనా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇంత అకస్మాత్తుగా ఎలా ఈ దాడి చేశారని ఆమె తన ట్వీట్‌లో తెలిపారు. సెబీ ఆఫీసులో అదానీకి స్నాక్స్ ఇస్తూ.. బీబీసీ ఆఫీసులో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube