ఐటీ దాడులు కొత్తకాదు

30ఏళ్లుగా చేస్తున్న మూడుసార్లు జరిగాయి

1
TMedia (Telugu News) :

ఐటీ దాడులు కొత్తకాదు

-30ఏళ్లుగా చేస్తున్న మూడుసార్లు జరిగాయి

-మర్రిరాజశేఖర్ రెడ్డి

టీ మీడియా ,నవంబర్ 24,హైదరాబాద్‌ : మంత్రి మల్లారెడ్డి నివాసాలతో పాటు ఆయన కుమారులు, అల్లుడు, బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు. ఈ సమయంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇండియాలో లేరు. టర్కీలో ఉన్నారు. మీడియా ద్వారా ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆయన సమాచారం అందిన వెంటనే టర్కీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఐటీ దాడుల గురించి ఆయన మాట్లాడుతూ..మీడియా ద్వారానే నాకు ఐటీ దాడులు విషయం తెలిసిందని 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం..మాకు ఐటీ దాడులు ఏమీ కొత్తకాదు…ఇప్పటి వరకు మూడు సార్లు జరిగాయి.

Also Read : రైతు సమస్యలపై ధర్నా

ఇది పెద్ద విషయం కాదు అని అన్నారు. కానీ ఈ ఐటీ దాడుల్లో ఎంత నగదు సీజ్ చేశారు అనే విషయం నాకు పూర్తిగా సమాచారం లేదని ఇక పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు.మాకు ఐటీ దాడులు కొత్తకాదు .. 30ఏళ్లుగా చేస్తున్న వ్యాపారంలో మూడుసార్లు జరిగాయి అన్నారు. సూటు, బూటుతో కళ్ళజోడు పెట్టి స్టైలిష్ గా అదరగొట్టిన సోనమ్ కపూర్.ఈ సందర్భంగా మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు తమ నవాసాల్ ఐటీ దాడులు జరిగాయని..పార్టీ మారాలని ఒత్తిడి చేయటానికే ఇదంతా చేస్తున్నారని తాను భావిస్తున్నానని అన్నారు.టర్కీ నుంచి హైద్రాబాద్ కు చేరుకున్న ఆయన తన నివాసంలో గురువారం (నవంబర్ 24,2022) ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు. .రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు నిర్వహించారని అన్నారు. తన నివాసంలో దాదాపు రూ. 4 కోట్లు సీజ్ చేసినట్లుగా సమాచారం ఉందన్నారు. కాలేజీల్లో వేతనాలకు నెలకు కనీసం కోటి రూపాయాలకుపైగా చెల్లిస్తున్నామని తెలిపారు.ఐటీ సోదాలను తాము తప్పు పట్టటంలేదని అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. తాముమ చట్టప్రకారంగా ట్యాక్సులు చెల్లిస్తామని..కానీ తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని చెప్పారు. తన తండ్రి, తల్లి, కూతురితోపాటు ఇతరుల ఫోన్లను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారని ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

Also Read : వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్ నిరసన

నమ్మించి మోసం చేశారు: మంత్రి మల్లారెడ్డి
2 రోజులు.. సుమారు 40 గంటలు.. 65 టీమ్స్‌.. 400 మంది అధికారులు.. పదిన్నర కోట్లు సీజ్‌.. ఇదీ అంకెల్లో మల్లారెడ్డి టార్గెట్‌గా సాగిన ఐటీ సోదాల సారాంశం. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సాగిన ఐటీ సోదాలు ఎట్టకేలకు ముగిశాయి. సోదాలతో అయిపోలేదని.. విచారణకు రావాలంటూ మల్లారెడ్డి, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌కు నోటీసులిచ్చింది ఐటీ. మంత్రి మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి.. వియ్యంకుడు లక్ష్మారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఇన్‌కంటాక్స్‌ ఆఫీసర్లు.

సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాల సమాచారం. ఈ తనిఖీల తర్వాత ఐటీ అధికారులు పంచనామాపై సంతకాలు తీసుకునేందుకు మూడు గంటల పాటూ అక్కడే ఉన్నారని సమాచారం. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లిన కుమారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తన కుమారుడితో బలవంతంగా సంతకం చేయించుకునే ప్రయత్నం చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube