పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

0
TMedia (Telugu News) :

పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

టీ మీడియా, నవంబర్ 9, ఖమ్మం బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, కేఎల్‌ఆర్‌, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు తాజాగా.. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని టార్గెట్‌ చేశారు. గురువారం ఉదయం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేశారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో ఐటి, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాలలో వచ్చిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బుధావరం ఖమ్మం జిల్లాకే చెందిన కీలక నేత తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసులు, ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. ఖమ్మంలో ఆయనకు చెందిన రెండు నివాసాల్లో పోలీసులు దాడులు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 వేల బోగస్‌ ఓట్లను చేర్పించారని మంత్రి పువ్వాడ అజయ్‌పై తుమ్మల ఆరోపించారు. ఆ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల గురించి బుధవారం మీడియాతో మాట్లాడిన పొంగులేటి కేంద్ర దర్యాప్తు సంస్థలైనా, ఐటీ, ఈడి దాడులపై కీలక కామెంట్స్‌ చేశారు.

Also Read : మెద‌క్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం..

తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆయన ఇలా చెప్పిన మరుసటి రోజే ఐటీ దాడులు జరగటం కలకలం రేపుతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube