ఎంబీబీఎస్‌ విద్యార్థిని మెడకోసి హత్య చేసిన ఐటీ ఉద్యోగి

ఎంబీబీఎస్‌ విద్యార్థిని మెడకోసి హత్య చేసిన ఐటీ ఉద్యోగి

1
TMedia (Telugu News) :

ఎంబీబీఎస్‌ విద్యార్థిని మెడకోసి హత్య చేసిన ఐటీ ఉద్యోగి

టీ మీడియా, డిసెంబర్ 6,అమరావతి : గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి ఎంబీబీఎస్‌ విద్యార్థి హత్యకు గురైంది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకున్నది. సర్జికల్‌ బ్లేడ్‌తో యువతి మెడపై కోసి హత్య చేశాడు. నిందితుడిని విజయవాడకు చెందిన ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేశాక జ్ఞానేశ్వర్‌ సైతం చేయి కేసుకోగా.. అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నిందితుడు జ్ఞానేశ్వర్‌, మృతురాలికి రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు విద్యార్థిని స్నేహితురాలు తన వద్దకు పిలిచింది. దీంతో వారం రోజులుగా మృతురాలు స్నేహితురాలి వద్దనే ఉంటోంది.

Also Read : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

ఈ క్రమంలోనే మృతురాలి స్నేహితురాలు జ్ఞానేశ్వర్‌, మృతురాలి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సోమవారం పిలిచింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్‌ సర్జికల్‌ బ్లేడ్‌తో యువతి మెడపై దాడి చేసి మరో గదిలోకి ఈడ్చుకు వెళ్లి తలుపులు బిగించాడు. యువతితో పాటు ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు గది తలుపులు పగులగొట్టి యువతి ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube