సమాచారం అడగడం మన హక్కు

సమాచారం అడగడం మన హక్కు

0
TMedia (Telugu News) :

సమాచారం అడగడం మన హక్కు

– గంధం రవికుమార్

టీ మీడియా, డిసెంబర్ 26, వనపర్తి బ్యూరో : భారత రాజ్యాంగం పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చింది. 21వ అధికరణం జీవించే హక్కు నిచ్చింది. ఎవరి భద్రతకు ప్రమాదం కనిపించినా వారికి సరియైన భద్రత కల్పించడానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వేలాది మంది పౌరులకు ఆవిధంగా భద్రత కల్పించడానికి ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నాయి. సమాచార హక్కు బిల్లుతోపాటు పార్లమెంటులో సమర్పించిన “లక్ష్యాలు, కారణాల ప్రకటన” (స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్) సమాచార హక్కును రాజ్యాంగం 19వ అధికరణలోని భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగంగా గుర్తించింది. ఒకవైపు ప్రాథమిక హక్కుగా గుర్తించి, సమాచార హక్కు గురించి ప్రచారం చేయకపోవడం మంచి పరిపాలన అనిపించుకోదు!స్తబ్ధంగా ఉన్న మానవ జీవితాన్ని ఒక్కసారిగా పరుగు పెట్టించిన చక్రం ప్రగతికి మార్పుకు సంకేతమైన చక్రం .‌‌‌‌‌ధర్మానికి చిహ్నంగా భావింపబడే దేశం, ఆ ధర్మచక్రాన్ని జాతీయ జెండాపై నిలిపి పూజించే ఏకైక దేశం. అవినీతి గ్రాహ్యక సూచికలో 78వ స్థానంలో’, మానవాభివృద్ధి పట్టికలో 130వ స్థానంలో తలవంచి ఎందుకు నిలబడింది? మన రాష్ట్రంలోని గ్రామాలలో 30 లక్షల కుటుంబాలు ఒక్క పూట భోజనంతో రోజులు వెళ్లదీస్తున్నాయి. 35% బాలలు (5 సంవత్సరములలోపు) పోషకాహార లోపంతో తగిన బరువు లేదు. 53% స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు”.

Also Read : వాజ్ పేయి జయంతి: బిజెపి శ్రేణుల ఘన నివాళి

సస్యశ్యామలమైన, పుష్కలమైన వనరులున్న బంగారు భూమిలో ఈ పేదరికం తాండవించడానికి బలమైన కారణం అవినీతి. మునిసిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా 5 నుండి 20 లక్షలు ఖర్చు చేయగల రాజకీయ పక్షాలు, 21 లక్షల నగదును కూడా చేతబట్టుకు తిరిగే సివిల్ సర్వెంట్లు, పప్పుల్లో, నూనెల్లో కూడా విష పదార్ధాలు కల్తీ చేసి అమ్ముకోగల వ్యాపారులు ఇంతటి గాఢాంధకారంలో చిరు దీపం సమాచార హక్కు !
సరిహద్దుల్లో అనునిత్యం యువసైనికుల రక్తతర్పణమే మనం ఇక్కడ స్వేచ్ఛగా ఎంజాయ్ చేయడానికి ఆధారం! వారు అడ్డు నిలబడకపోతే కొన్ని గంటల్లో దేశాన్ని ఇక్రమించగల సత్తా శతృదేశాలకు ఉంది. (మన సైనికుల సంఖ్య పది లక్షలు కానీ చైనా సైనికుల సంఖ్య 28 లక్షలు). సమాజంలో ఇంత అవినీతి పేరుకుపోతుంటే వారి త్యాగాలకు, నిస్వార్ధతకు ప్రయోజనం ఏముంటుంది? వారెవరికోసమైతేరక్తం ధార పోస్తున్నారో ఆ ప్రజలను కొందరు స్వార్ధపరులు పీడించుకు తింటుంటే, అవమానాలపాలు చేస్తుంటే – మనలో దేశభక్తి ఏ కోశాన అయినా ఉంటే ఒక చైతన్యవంతులైన పౌరునిగా ఈ అవినీతిపై పోరాడాలి. కత్తులు, కర్రలు పట్టనవసరంలేదు, సమాచార హక్కును వినియోగించండి, అడగండి ప్రచారం చేయండి, అనుమానం ఉన్న ప్రతిచోట దరఖాస్తు చేయండి, బయటికి లాగండి, సంఘటితంగా ఫిర్యాదు చేయండి, శిక్షించండి!అవినీతిని నిర్మూలించిన రోజే మన దేశంలో కోట్లాది పిల్లలకు కడుపునిండా అన్నం దొరుకుతుంది, పేదరికం మాయమవుతుంది, భారత దేశం శక్తివంతమైన దేశంగా వెలుగుతుంది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube