పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

0
TMedia (Telugu News) :

పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

టీ మీడియా, నవంబర్ 10, హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు శుక్రవారంతో ముగిశాయి. మూడు బ్యాగులు, ఒక బ్రీఫ్‌కేస్‌, ప్రింటర్‌, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక రూమ్‌ లాక్‌ చేసి ఉండడంతో కీస్‌ తీయకుని రావాలని పొంగులేటి భార్యకు ఐటీ అధికారులు సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి కీస్‌ తీసుకురాలేకపోవడంతో డోర్‌ బ్రేక్‌ చేసి లోపలికి వెళ్లి సోదాలు జరిపారు.పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో రెండో రోజుల వరకు ఐటీ అధికారులు సోదాలు కొనసాగాయి. అయితే దీనిపై ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. నాలుగు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా పది చోట్ల ఐటీ దాడులు సాగుతూనే ఉన్నాయి.. సెంట్రల్‌, స్టేట్‌ ఎన్నికల కమిషన్‌ లకు ఫిర్యాదు చేశాను అని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వాలకు సపోర్టు ఉందా అని పిస్తోంది.. ఎన్నికల కమిషన్‌ బ్యాలెన్స్‌ తప్పుతున్నారా లేక అధికారం ఒత్తిడికి లోంగుతున్న రా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల మీదనే దాడులు జరుగుతున్నాయని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీజేపీ- బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఫెవికాల్‌ సంబందం ఉంది అని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆరోపించారు. తుమ్మల ఇంట్లో తనిఖీల్లో ఏమి లభించలేదు.. నా ఇంట్లో ఐటీ సోదాల్లో వారికి ఏమి దొరకలేదు.. నా అల్లుడు మీద దురుసుగా ప్రవర్తించారు.. నా ఉద్యోగి జయ ప్రకాష్‌ నీ కొట్టారు.. థర్డ్‌ డిగ్రీ ఉపయోగించారు.. వంటి కాలు మీద చైర్‌ లో నిలబెట్టారు.. ఒప్పుకోవాలని బలవంతం చేశారు.

Also Read : సీఎం జగన్‌ కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం

అని ఆయన వెల్లడించారు. ఐటీ అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దీని వెనుక కారణాలు ఏమిటి.. మ్యాన్‌ హ్యాండిలింగ్‌ చేసే హక్కు ఎవ్వరూ ఇచ్చారు అని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు. మిమ్ములను ఎవ్వరూ పంపించారు అని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అడిగారు. వారి కోసం మీరు చేసే పద్ధతులు సరికాదు. తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకుంటాము.. జైళ్లలో పెడతమని బెదిరించారు.. అధికారులు మీరు హద్దుల్లో ఉండాలి.. ఐటీ రూల్స్‌ అందరికీ తెలుసు, అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలికితే చాలు అన్నట్లుగా ఉన్నారు అంటూ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube