తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కాలేజీల్లో ఐటీ సోదాలు
తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కాలేజీల్లో ఐటీ సోదాలు
తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కాలేజీల్లో ఐటీ సోదాలు
టీ మీడియా, నవంబర్ 3, చెన్నై: తమిళనాడులోని అధికారపార్టీ నాయకులు, మంత్రుల ఇండ్లపై జాతీయ సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం స్థాలిన్ కేబినెట్‌లోని పబ్లిక్ వర్క్స్ మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి చెన్నై, తిరువళ్లూరు, తిరువన్నమళై, తిరుచ్చి, కరూర్ సహా 40కిపైగా ప్రాంతాల్లో అధికారు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి వేలుకు చెందిన అరుణై మెడికల్ కాలేజీ, అరుణై ఇంజినీరింగ్ కాలేజీ, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. మంత్రి ఆస్తులతోపాటు ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలో పరిధిలోని కాంట్రక్టర్లపై ఐటీ అధికారులు దృష్టి సారించారు.
Also Read : గాజా సిటీని చుట్టుముట్టిన ఇజ్రాయిల్ దళాలు
ఇక ప్రముక రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటికే మంత్రి సెంథిల్ బాలాజీ, డీఎంకే ఎంపీ జగత్‌రక్షకన్ ఇండ్లు, కార్యాలయాల్లో కూడా అధికారులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube