వ్యాపారి ఇంట్లో IT సోదాలు

రూ.58 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం

1
TMedia (Telugu News) :

వ్యాపారి ఇంట్లో IT సోదాలు

-రూ.58 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం
టీ మీడియా ,ఆగష్టు 11, ముంబై: మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.

 

Also Read : రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

 

ఏకంగా రూ.58 కోట్ల నగదు, 38 కిలోల బంగారం, వజ్రాభరణాలు, ఆస్తులకు సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు గుర్తించారు. మొత్తంగా రూ.390 కోట్ల విలువచేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ నెల 1 నుంచి 8 వరకు జాల్నా, ఔరంగాబాద్‌లోని వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఎనిమిది రోజులపాటు నిరాటంకంగా కొనసాగిన ఈ తనిఖీల్లో 260 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube