ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు

0
TMedia (Telugu News) :

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

– వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు

టీ మీడియా, జనవరి 4, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రానికి దగ్గరగా 5 కి.మీ. దూరంలో గల తిరుమలనాథ గుడి (తిరుమలయ్య గుడి) దిన దినాభివృద్ది చెందుతూ ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నది. భక్తుల కోర్కెలను తీరుస్తున్న తిరుమలనాథుడి దేవాలయానికి భక్తుల సంధర్శన పెరుగుతూనే వున్నది. తిరుమలయ్య గుట్ట ప్రాంతంలో కూడా తిరుపతి తిరుమలలో ఏడు కొండలు వున్నట్లుగా ఇక్కడ కూడా ఏడు కొండలు వున్నవి. తిరుమలలోని అడవిలో వున్నట్లుగానే ఇక్కడి తిరుమలయ్య గుట్టలలో కూడా అత్యంత అరుదైన, విలువైన వృక్షజాతి ఔషధ మొక్కలు గలవు. గతంలో ప్రభుత్వ ఆచార్యులు (ప్రొఫెసర్) తిరుమలయ్య గుట్టలలో అత్యంత విలువైన ఔషద మొక్కలతోపాటు సంజీవని మొక్కను కూడా గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు.

Also Read : కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్‌

ఇలా అత్యంత విలువైన మొక్కలతో కూడిన తిరుమలయ్య కొండలు గల అటవీ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరచి పెద్ద పార్కును ఏర్పాటు చేసినచో విలువైన మొక్కలను కాపాడినట్లవుతుంది. పార్క్వల్ల భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు వనపర్తి జిల్లా కేంద్ర ప్రజలకు ఆహ్లాదం కలుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తిరుమలయ్య కొండపై గల తిరుమలనాథుడిని దర్శించుకొనేందుకు వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామాల భక్తులు ప్రజలు వేలసంఖ్యలో దర్శించుకుంటున్నారు. మరియు ఇట్టి తిరుమలయ్య గుట్ట వనపర్తి కర్నూల్ ప్రధాన రోడ్డుకు అనుసరించి వున్నందున రవాణా సౌకర్యం కూడా చాలా బాగున్నది. దీనివల్ల తిరుమలయ్య గుట్ట దినదినాభివృద్ధి చెందుతున్నది. మరియు పై విషయాలను దృష్టలో వుంచుకుని తిరుమలయ్య కొండదగ్గరలో భక్తులకు, ప్రజలకు సౌకర్యం నిమిత్తం పార్క్, కళ్యాణ మండపము ఇతర వసతి సౌకర్యలు ఏర్పాటు చేసినచో వివాహాలు, శుభకార్యాలు చేసుకుంటూ ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందును. ఇట్టి సౌకర్యాలకు సరిపోయినందు భూమి ఇక్కడ పుష్కలంగా వున్నది.

Also Read : బీసీలకు ఏం చేశారని వైసిపి నేతలు సాధికార యాత్ర

కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇట్టి విషయముపై స్పందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకటించి పైతెలిపిన సౌకర్యాలు కల్పించాలని బంగారు శృతి భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బిజెపి బచ్చురాము, వనపర్తి పట్టణ ఉపాధ్యక్షుడు పీఎం రాము, ఓం ప్రకాశ చారి తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube