మీ అంచనాలకు మించి అభివృద్ధి చేస్తా

మీ అంచనాలకు మించి అభివృద్ధి చేస్తా

0
TMedia (Telugu News) :

మీ అంచనాలకు మించి అభివృద్ధి చేస్తా

టీ మీడియా, నవంబర్ 3, వనపర్తి బ్యూరో : తెలంగాణలో వేగంగా అభివృద్ధి ప్రజలు గుండెల నిండా ఆశీర్వదిస్తున్నారు.నవీన, ఆధునిక పట్టణంగా వనపర్తి రూపుదిద్దుకుంటున్నది. జరుగుతున్న అభివృద్ధి ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నది. వందేళ్ల భవిష్యత్ లక్ష్యంగా వనపర్తి పునాదులు నిర్మించాం. అనేక ఉన్నత విద్యాసంస్థలను తీసుకువచ్చాం .మరిన్ని విద్యా సంస్థలు తీసుకురాబోతున్నాం. పశువైద్య కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు కాగానే దానిని ఏర్పాటు చేసి తీరుతాం.విపక్షాలకు విజన్ లేదు .. వారికి కనీసం మదిలో కల లేదు, కల్పన కూడా లేదు. జరుగుతున్న అభివృద్ధి ముందుకు తీసుకువెళ్లేందుకు మరోసారి అండగా నిలిచి ఆదరించాలని కోరుతున్నాను. నియోజకవర్గంలో తాగునీరు, సాగుతారు, కరంటు, రహదారులను నిర్మించాం. ముఖ్యమంత్రి ఆశీస్సులతో వనపర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెడతాను.షటిల్ క్రీడాకారులతో కలిసి కాసేపు మంత్రి నిరంజన్ రెడ్డి షటిల్ ఆడారు.అనంతరం జిల్లా కేంద్రంలోని 27 వ వార్డు లో వార్డు కౌన్సిలర్ లక్ష్మీ దేవమ్మ , స్థానిక నాయకుల తో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ లో మీడియాతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గ ఎన్నికల ప్రతినిధి వంగూర్ ప్రమోద్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ,

Also Read : అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ ముఠా అరెస్ట్‌..

పట్టణ అధ్యక్షుడు మార్కేట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్, రీజనల్ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్ మీడియా సెల్ కన్వీనర్లు నందిమల్ల.అశోక్, నందిమల్ల.శ్యామ్,మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు నరసింహ, సింగిల్ విండో వైస్ చైర్మన్ పోతుల పల్లి రాజు, కౌన్సిలర్లు కంచె రవి, పాకనాటి కృష్ణయ్య, జంపన్నా, పుట్ట పాకుల మహేష్, నాగన్న యాదవ్, భాష్య నాయక్, నాయకులు మురళి సాగర్, రవి, బీరయ్య, ఇమ్రాన్, నందిమల్ల సుభాష్, శివ సంతోష్ కుమార్, ముని కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube