‘ఖని’లో సందడి చేసిన జబర్ధస్త్ వినోదిని

ఆకాశమంత లఘు చిత్రం ఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

‘ఖని’లో సందడి చేసిన జబర్ధస్త్ వినోదిని

ఆకాశమంత లఘు చిత్రం ఆవిష్కరణ

నటులకు అభినందన

టి మీడియా,ఆగస్ట్ 17,గోదావరిఖని : విస్మ్రుతమౌతున్న నాన్న ప్రేమ ‘ఆకాశమంత’ అనే కథాంశంతో లఘు చిత్రం నిర్మించడం అభినందనీయమని జబర్ధస్త్ ఫేం వినోదిని అలియాస్ వినోద్ ప్రశంసించారు.స్థానిక కళాకారులు మేజిక్ రాజా, చంద్రపాల్ ప్రధాన పాత్రధారులుగా,చంద్రపాల్ నటించి,దర్శకత్వం వహించిన ‘ఆకాశమంత’ లఘు చిత్రాన్ని బుధవారం స్థానిక చౌరస్తా సమీపంలోని నిరీక్షణ ఆర్ట్స్ కార్యాలయం ఆవరణలో ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ చేతులమీదుగా ఆవిష్కరించారు. అతిథులతో కలిసి ఆయన చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…అమ్మ ప్రేమపై వచ్చినన్ని సినిమాలు, కథలు, పాటలు నాన్న గురించి రాలేదని,ఈ చిత్రం ఆ లోటును తీరుస్తుందన్నారు.

 

Also Read : ఐటీసీ విధానం తోబంగారు భవిష్యత్త

 

ఈ చిత్రం చూసిన ప్రతి కళ్ళూ నాన్నపై కృతజ్ఞతతో చెమ్మగిల్లుతాయన్నారు. రాశికన్నా వాసి ముఖ్యంగా కేవలం సెల్ ఫోన్ తోనే షూటింగ్,ఎడిటింగ్, డబ్బింగ్,రీ-రికార్డింగ్ చేయడం అభినందనీయమన్నారు. నిరీక్షణ బ్యానర్ పై మరిన్ని మంచి చిత్రాలు తీయాలని, మంచి సందేశంతో నిర్మించిన చిత్రాన్ని అమర కళాకారుడు జాకబ్ కు అంకితమివ్వడం ప్రశంసనీయమన్నారు. అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని,యూ ట్యూబ్ లో నిరీక్షణ ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి కళాకారులు కే.స్వామి,సీనియర్ కళాకారులు దామెర శంకర్, పాత్రికేయులు దయానంద్ గాంధీ,నటులు, కళాకారులు కనకం రమణయ్య,అందె సదానందం,కాశిపాక రాజమౌళి,సోగాల వెంకటి, మాదరి వాసు,తిప్పబత్తిని అంజయ్య,బోడకుంట వెంకట్రాజం,మేజిక్ హరి, ధన్సింగ్,ఎల్వి రావు,శాంతి నిరీక్షణ,రాం మోహన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube