టీ మీడియా ప్రతినిధి తెలంగాణ. 23-11-2021

0
TMedia (Telugu News) :

ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కార్

కేసిఆర్ తీరు మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించిన JAC చైర్మన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆది నుండి ఉద్యమ ద్రోహులను తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులను పెంచి పోషిస్తూ నిఖార్సయిన ఉద్యమ కారులను అవమాన పరుస్తుందని కాకతీయ యూనివర్సిటీ JAC చైర్మన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి కేసుల పాలై జైలు జీవితం సైతం అనుభవించి ఉన్నత విద్యను అభ్యసించిన ఉద్యమ కారులకు ఎమ్మెల్సీలు గా అవకాశం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకు అడుగడుగునా అడ్డుకొని అక్రమ కేసులు బనాయించి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన ద్రోహులు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లకు అవకాశం కల్పించడం తెలంగాణ రాష్ట్రం కోసం ఆసువులు బాసిన అమరులను విస్మరించడమేనన్నారు.

ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను ఏకగ్రీవాల పేరుతో దగా చేస్తున్నాడని రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులకు నాటి నుండి నేటి వరకు ఒక్క అవకాశం కూడా లేనప్పటికీ ఉద్యమ ద్రోహులకు, కుటుంబ సభ్యులకు ప్రతి ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తూ.. తన కుటిల రాజకీయ బుద్దికి తెర లేపారని అన్నారు. రాష్టంలో రైతులు, నిరుద్యోగులు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని..రాబోయే రోజుల్లో ఉద్యమ కారులకు అవకాశం కల్పించాలని లేని పక్షంలో తెలంగాణలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని తెలంగాణా రాష్ట్ర కేసిఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

JAC Chairman warns of another movement if KCR does not change course.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube