ఉప రాష్ట్ర‌ప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం

ఉప రాష్ట్ర‌ప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం

1
TMedia (Telugu News) :

ఉప రాష్ట్ర‌ప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం

టీ మీడియా ,ఆగష్టు 11, న్యూఢిల్లీ : భార‌త 14వ ఉప రాష్ట్ర‌ప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ధ‌న్‌ఖ‌ర్ చేత రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణం చేయించారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు హాజ‌ర‌య్యారు. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్, విప‌క్షాల అభ్య‌ర్థిగా మార్గ‌రెట్ అల్వా పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.

Also Read : ప‌శువుల స్మ‌గ్లింగ్ కేసు

మార్గరెట్ అల్వా మీద 346 ఓట్ల ఆధిక్యంతో ధ‌న్‌ఖ‌ర్ గెలిచారు. మొత్తం పోలైన 725 ఓట్లలో జగదీప్ ధన్‌ఖ‌ర్‌కు 528 ఓట్లు వచ్చాయి. మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు లభించాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పార్లమెంటు ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభలకు ఎన్నికైన, నామినేట్ అయిన మొత్తం 780 మంది ఎలక్టర్లకు గాను.. 725 మంది ఓట్లు వేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube