బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి జ‌గ్జీవ‌న్‌రాం :ఎంపీ నామ

బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి జ‌గ్జీవ‌న్‌రాం :ఎంపీ నామ

1
TMedia (Telugu News) :

బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి జ‌గ్జీవ‌న్‌రాం :ఎంపీ నామ

టీ మీడియా,ఏప్రిల్ 6,న్యూఢిల్లీఃబ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ అని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు అభివ‌ర్ణించారు. దేశంలోని ద‌ళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయ‌న‌ కృషి శ్లాఘ‌నీయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ‌ నాగేశ్వ‌రరావు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. జగ్జీవన్‌ రామ్ కుమార్తె తెలంగాణ బిల్లు సంద‌ర్భంగా లోక్‌స‌భ స్పీక‌ర్ రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌కారం అందించార‌ని ఎంపీ నామ నాగేశ్వ‌రరావు గుర్తు చేశారు. తాను ఆ సమ‌యంలో పార్ల‌మెంట్ స‌భ్యుడిగా తెలంగాణ కోసం ఆమెతో పలుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు వెల్ల‌డించారు. జ‌గ్జీవ‌న్‌రాం స్ఫూర్తి, ఆశ‌యాల‌తో తెలంగాణలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. ద‌ళితుల అభ్యున్న‌తికి రాష్ట్రంలో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ద‌ళిత సాధికారిత‌కు తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Also Read : 22 యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube