జగన్ కనుసైగ చేస్తే చాలు

-బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

0
TMedia (Telugu News) :

జగన్ కనుసైగ చేస్తే చాలు.

-బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

 

టీ మీడియా,జనవరి 10 ,అమరావతి : ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీపై స్పందిస్తూ.. ఎంతమంది కలిసి వచ్చినా సరే.. జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ప్రజల్లో సీఎం జగన్ అంటే మన అనే భావన ఉందని.. ఆయన రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తూ మార్పు తెస్తున్నారన్నారు. మరోవైపు బైరెడ్డి పాల్గొన్న ర్యాలీపై టీడీపీ, జనసేన పార్టీలు మండిపడుతున్నాయి. జీవో నంబర్ 1 వారికి వర్తించదా అంటున్నారు.వైఎస్సార్‌సీపీ కి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా ఫర్వాలేదని.. పార్టీ యువతంతా సీఎం జగన్‌కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామన్నారు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. రాజమండ్రిలో జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు. “ముఖ్యమంత్రి జగన్ మావాడు’ అని ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని బైరెడ్డి అన్నారు. జక్కంపూడి కుటుంబం అంటే తమ సొంత కుటుంబం అనే భావన జిల్లా ప్రజల్లో ఉందన్నారు. పార్టీ యువజన విభాగం సీఎం జగన్‌కు రక్షణ వలయంలా పనిచేస్తుందన్నారు.జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదన్నారు. జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందన్నారు.

Also Read : హర్యానా ఉపముఖ్యమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

రాష్ట్రానికి జగన్ మంచి చేస్తున్నారని, రాష్ట్రంలో మార్పు తెస్తున్నారన్నారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంత మంది పొత్తుల కోసం తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగనుకలిసినవారినిఏమంటారన్నారు.మరోవైపు బైరెడ్డి హాజరైన కార్యక్రమంపై టీడీపీ, జనసేన పార్టీలు మండిపడుతున్నాయి. కొంతమూరు బ్రిడ్జి నుంచి కోరుకొండ మండలం గాడాల వరకు వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్డు షోలో ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ ర్యాలీపై జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. ఏపీలో ఎమర్జెన్సీని మంచిన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.

Also Read : తాజ్‌మ‌హ‌ల్‌కు నోటీసులు.

వైఎస్సార్‌సీపీ నేతలు విచ్చలవిడిగా రోడ్ షో‌లు చేస్తున్నారని.. పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలో గవర్నర్ పాలన విధించాలని.. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైఎస్సార్‌సీపీకి ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పటం దుర్మార్గం అన్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ప్రైవేట్ సైన్యం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రైవేట్ సైన్యం పేరుతో విపక్షాలను భూస్థాపితం చేసే విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నారు. వైఎస్సార్‌సీపీని, జగన్ ప్రైవేట్ సైన్యాన్ని జనం ఇంటికి పంపుతారన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube