జగన్‌ దావోస్‌ వేదికపై అవాస్తవాలు మాట్లాడారు

జగన్‌ దావోస్‌ వేదికపై అవాస్తవాలు మాట్లాడారు

1
TMedia (Telugu News) :

జగన్‌ దావోస్‌ వేదికపై అవాస్తవాలు మాట్లాడారు : పవన్ కల్యాణ్‌
టీ మీడియా,మే 25,అమరావతి : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దావోస్ వేదికపై పచ్చి అబద్దాలు మాట్లాడారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఏపీలో వాస్తవాలు ఒకటైతే దానికి భిన్నంగా విదేశిపెట్టుబడుల కోసం మాట్లాడారని ఆరోపించారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఏపీలో బాధితులకు ఆక్సిజన్ కూడా అందించలేకపోయారని పేర్కొన్నారు. తిరుపతి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 30మంది చనిపోయిన విషయాన్ని వేదికపై ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.ఏపీలో అంబులెన్సులు , ఆస్పత్రిలో చనిపోతే కనీసం మృతదేహాన్ని తరలించడానికి వాహనాలు లేవని వెల్లడించారు.

Also Read : జ్ఞాపికను అందజేసిన డిప్యూటీ తహసీల్దార్

ఏపీ ప్రభుత్వం వైద్య సేవలందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం రూ. 11 వందల కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. రుయా ఆసుపత్రిలో పసిబిడ్డ మృతదేహాన్ని నిరుపే పేద తండ్రి బైక్ మీద తీసుకువెళ్లిన ఘటనను ప్రజలు మరిచిపోలేదని అన్నారు.ప్రభుత్వ విధానాలు, అధికారంలో ఉన్న నాయకుల వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube