జగదీష్ శెట్టార్ చేరికతో కాంగ్రెస్ బలోపేతం : మల్లికార్జున్ ఖర్గే
జగదీష్ శెట్టార్ చేరికతో కాంగ్రెస్ బలోపేతం : మల్లికార్జున్ ఖర్గే
జగదీష్ శెట్టార్ చేరికతో కాంగ్రెస్ బలోపేతం : మల్లికార్జున్ ఖర్గే
టీ మీడియా, ఏప్రిల్ 17, బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం, ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ శెట్టార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తమ పార్టీ బలోపేతమవుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.బీజేపీని వీడిన జగదీష్ శెట్టార్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖర్గేతో పాటు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, విపక్ష నేత సిద్ధరామయ్య సమక్షంలో శెట్టార్ కాంగ్రెస్‌లో చేరారు. శెట్టార్ రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత శక్తివంతమవుతుందని, తమ పార్టీ కార్యక్రమాలను చూసి లింగాయత్‌లు తమను ఆదరిస్తారని ఖర్గే అన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తాను ఈరోజు కాంగ్రెస్‌లో చేరానని శెట్టార్ చెప్పారు. విపక్ష నేత, మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తాను కాంగ్రెస్‌లో చేరడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, బీజేపీ అభివృద్ధి కోసం శ్రమించిన తనకు టికెట్ నిరాకరించడం బాధించిందని చెప్పుకొచ్చారు. తనకు టికెట్ రాకున్నా ఏ ఒక్కరూ తనతో మాట్లాడటం, తనను అనునయించడం చేయలేదని, తనకు ఏ పదవి ఇస్తారనే విషయం కూడా తనతో చర్చించలేదని అన్నారు. తనను డీకే శివకుమార్, సిద్ధరామయ్య, సుర్జీవాలా, ఎంబీ పాటిల్ సంప్రదించి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంతో మరో మార్గం లేక తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. శెట్టార్‌తో పాటు సీనియర్ బీజేపీ నేత అమర్ సింగ్ పాటిల్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
AlsoRead:గుడిసెలు వేసుకొన్న పేదలకు పట్టాలు ఇవ్వాలి
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube