మంత్రి పువ్వాడ అజయ్ ఓ సైకో: జగ్గారెడ్డి

టి మీడియా, ఎప్రిల్ 18హైదరాబాద్‌

1
TMedia (Telugu News) :

మంత్రి పువ్వాడ అజయ్ ఓ సైకో: జగ్గారెడ్డి
టి మీడియా, ఎప్రిల్ 18హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పువ్వాడ ఓ సైకో అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దగ్గర మార్కుల కోసమే పువ్వాడ ఓవరాక్షన్ చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా ఖమ్మంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిపై ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపించాలన్నారు. పోలీసులపై ప్రజలకు విశ్వాసం పోకుండా ఎస్పీ చూడాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.

 

also read; యాపిల్‌ పుట్టినిల్లు ఎక్కడో తెలుసా…?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube