జలగం”ప్రమాణస్వీకారం వాయిదే

జలగం"ప్రమాణస్వీకారం వాయిదే

0
TMedia (Telugu News) :

సుప్రీం కోర్టులో తీర్పు వచ్చేవరకు
“జలగం”ప్రమాణస్వీకారం వాయిదే

ఖమ్మం :
బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కి వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తీర్పును రిజర్వు పెట్టింది. అయితే, వనమా సుప్రీంకోర్టుకు వెళ్తుండటంతో జలగం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అడ్డంకిగా మారింది.అయితే హైకోర్టు గురువారం తీర్పు వెలువరించే అవకాశం ఉండగా, వనమా సుప్రీంలో అప్పీల్ చేయనున్నారు.దీంతో ఉన్నత న్యాయం స్థానం తీర్పు వెలువడే వరకు వెంకట్రావు ప్రమాణ స్వీకారం వాయిదా పడనుంది. సుప్రీంకోర్టు సైతం ఎలాంటి తీర్పును ఇస్తుందోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.                     

also read :ఆహార సంస్థ (గోదాం ల) భద్రత కుంభ కోణం

వనమా, జలగం ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావడం విశేషం.వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీని బుధవారం అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు వెంకట్రావు అందచేశారు.కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను పరిగణించి ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.అనంతరం మీడియాతో మాడుతూ.. ఖమ్మం జిల్లాలో 2014లో బీఆర్ఎస్​నుంచి తాను ఒక్కడినే గెలిచానని వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయ కుతంత్రాల వలన 2018లో ఓడిపోయినప్పటికీ.. బీఆర్ఎస్​పార్టీలోనే ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు. రెగ్యులర్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, నేను ఏమి చేశానో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, ఏమీ చేస్తానో కూడా వారికి తెలుసు అని స్పష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube