జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాలని

-తాసిల్దార్ కి వినతిపత్రం

1
TMedia (Telugu News) :

జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ..

-తాసిల్దార్ కి వినతిపత్రం

టీ మీడియా, జులై 16, జన్నారం:జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాలని శనివారం రోజున నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొత్త వేణుగోపాల్ గుప్తా ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్ కు వినతి పత్రం అందించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం విధి నిర్వహణలో భాగంగా వార్త సేకరణ కోసం వెళ్లి వరదలు గల్లంతైన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారికి తక్షణ సాయం అందించాలని మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి చేయూతగా నిలవాలని అన్నారు.

Also Read : కెవిపిఎస్ జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయండి

ఈ కార్యక్రమంలో వెంకట పని రాజు, లక్ష్మీరాజం, నగరు అరుణ్ కుమార్,పర్ల శంకర్ ,గోలి మణికుమార్ ,కనికరం కిరణ్, కొమురవెల్లి శివ కృష్ణ, నిమిష కవి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube